కొడుకు గొంతు పిసికి, మహిళపై గ్యాంగ్ రేప్ చేసి అమ్మేశారు
రేవారీ: 25 ఏళ్ల మహిళ పైన కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెను రూ.40వేలకు ఓ వ్యక్తికి అమ్మివేశారని, ఆమె మూడేళ్ల కొడుకును పిసికి చంపేశారని పోలీసులు శనివారం తెలిపారు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలోని రేవారీలో జరిగింది.
ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను గుర్తించామని పోలీసులు చెప్పారు. వారిలో సతీష్ కుమార్, జైపాల్, హవా సింగ్, సూరజ్ భాన్ సైనీ, సందీప్ ఉన్నారని చెప్పారు. మహిళ పైన అత్యాచారం, ఆమె కొడుకు హత్యకు సంబంధించిన కేసులో ఈ ఐదుగిరిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
బాధితురాలి వలస వచ్చిన మహిళ. ఆమె కొద్ది రోజుల క్రితం ముకేష్ అనే ట్రక్ డ్రైవరును రైల్వే స్టేషన్లో కలిసింది. ఆమెను తన గ్రామానికి తీసుకు వెళ్లాడు.

డిసెంబర్ 10వ తేదీన ముఖేష్ సోదరుడు సతీష్ తన ఇద్దరు స్నేహితులు జైపాల్, హవా సింగ్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె కొడుకు గొంతు పిసిసి చంపాడు. అనంతరం ఆమెను సురజ్ భాను ద్వారా సందీప్‌కు రూ.40వేలకు అమ్మేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, అరెస్టు చేశారు.
'రెండో భార్య అయినా వేధింపుల కేసు పెట్టవచ్చు'
తన పైన రెండో భార్య వేధింపుల కేసు పెట్టడానికి వీల్లేదని, ఆ కేసు నుండి విముక్తిన్ని చేయాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైదరాబాదులోని హైకోర్టు కొట్టివేసింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ తన రెండో భార్య దాఖలు చేసిన కేసుకొట్టేయాలని కరీంనగర్ జిల్లాకు చెందిన తిరుపతి రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రెండో భార్య కాబట్టి తన పైన కేసు పెట్టడానికి అర్హత లేదని పేర్కొన్నారు. తిరుపతి రెడ్డి మొదటి భార్య సమ్మతితోనే తనను వివాహం చేసుకున్నాడని, కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభించాడని రెండో భార్య ఫిర్యాదు చేశారు.
దీనిపై తిరుపతి రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపిస్తూ.. రెండో భార్యతో తనకు చట్టబద్దమైన వివాహం జరగలేదని, అందువల్ల ఆమెకు తన పైన ఫిర్యాదు చేసే అర్హత లేదన్నారు. దీనిపై విభేదించిన కోర్టు పిటిషన్ కొట్టివేసింది. ఈ కేసులో దర్యాఫ్తు కొనసాగించాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications