అమ్మాయిపై 3 నెలలు రేప్: భర్తకు భార్య సాయం

భోపాల్: మధ్యప్రదేశ్‌లో అత్యంత నీచమైన సంఘటన జరిగింది. ఓ 14 ఏళ్ల వయస్సు గల బాలికపై ఓ వ్యక్తి మూడు నెలల పదే పదే అత్యాచారం చేశాడు. పైగా అత్యాచారం చేయడానికి ఆ వ్యక్తికి భార్య సాయం చేసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని మోరేనా జిల్లాలో జరిగింది.

బాలిక గర్భవతి కావడంతో తల్లిదండ్రులకు ఆ విషయం తెలిసింది. పెరుగుతున్న పొట్ట గురించి తల్లిదండ్రులు అడగడంతో బాలిక అసలు విషయం వారికి చెప్పింది. బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఆమె కడుపులో మూడు నెలల పిండం పెరిగినట్లు వారు చెప్పారు.

Woman helps husband rape 14-year-old

బాలికపై దుర్మార్గానికి పాల్పడిన దంపతులు పప్పు కవాడియా (50), అతని భార్య అమీనా (45)లపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్వీట్లు ఇస్తానని బాలికను మూడు నెలల క్రితం పప్పు బుజ్జగించి తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. బాలికను పప్పు పడకగదిలోకి తీసుకుని రాగానే భార్య లోపలి నుంచి ఇంటి తలుపులు మూసేసింది.

పప్పు బాలికపై అత్యాచారం చేశాడు. విషయాన్ని బయట పెట్టవద్దని అతను అమ్మాయిని బెదిరించాడు. అప్పటి నుంచి బాలికపై పలుమార్లు అతను అత్యాచారం చేశాడు. గర్భం తీసేయడానికి తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. అత్యాచారం చేయడానికి ఓ భార్య భర్తకు సహకరించిన సంఘటన మనేరా జిల్లాలో ఇది రెండోది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+