భార్య ఆరోగ్యం కోసం థానేలో మహిళ నరబలి, అరెస్ట్

Woman killed in human sacrifice ritual in Nalasopara, 6 arrested
ముంబై: యాభై ఏళ్ల మహిళను నరబలి ఇచ్చిన ఆరుగురు వ్యక్తులను మహారాష్ట్ర పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నరబలికి కళావతి రమాశ్రీ అనే మహిళ బలైంది. ఉత్తర ప్రదేశ్‌లో నివాసం ఉండే కళావతి కుమారుడికి ఒంట్లో బాగాలేకపోవడంతో సర్వజిత్ రాందేవ్ కహర్ అనే స్వామీజీని కలవాల్సిందిగా కొందరు సలహా ఇచ్చారు.

దీంతో ఆమెను అదే ప్రాంతంలో ఉంటున్న రాంధానీ కృపాశంకర్ అనే వ్యక్తి తన ఆటోలో పలుమార్లు కహర్ వద్దకు తీసుకు వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో రాంధానీ భార్యకు ఆరోగ్యం పాడైంది. ఎవరినైనా బలిస్తే అంతా సర్దుకుంటుందని కహర్ స్వామీజీ రాంధానీకి చెప్పాడు.

దీంతో కళవతిని బలిచ్చేందుకు నిర్ణయించుకున్నారు. ఇంట్లో పూజ చేస్తున్నామని, దాంట్లో పాల్గొంటే మీ కుమారుడికి నయమవుతుందని చెప్పి నవంబర్ 16వ తేదిన కళావతిని ఇంటికి తీసుకు వచ్చారు. ఆ పూజా కార్యక్రమంలో తల నరికి బలి ఇచ్చారు.

ఆ తర్వాత ఆమె మొండాన్ని ఓ గోనె సంచిలో కట్టి రోడ్డు పక్కన పడేశారు. తలను వసాడా వంతెన వద్ద పడేశారు పోలీసులు కేసును ఛేదించి నిందితులు, స్వామీజీ సహా ఆరుగురిని అరెస్టు చేశారు. మూఢనమ్మకాల వ్యతిరేక బిల్లును మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పాస్ చేసింది ఆ మరుసటి రోజే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+