యూపీలో దారుణం: తన ప్రియుడిని చంపేందుకు కూతురి ప్రియుడి సహకారం తీసుకున్న మహిళ

మీరట్: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తన కూతురును పదిమందిలో అవమాన పరుస్తున్నాడని చెప్పి అక్రమసంబంధం నెరిపిన వ్యక్తిని హతమార్చింది ఓ తల్లి. ఇందుకోసం కూతురి ప్రియుడి సహకారం తీసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే ఔరంగషాపూర్‌లో నివాసముంటున్న షమీమ్ అనే 35 ఏళ్ల మహిళ రాజీవ్ అలియాస్ రాజు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

రాజీవ్‌ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ ఒక వ్యవసాయ భూమిలో పనిచేస్తూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి ఇద్దరి మధ్య అక్రమసంబంధం మొదలైంది. షమీమ్ అనే ఈ మహిళకు ఓ కూతురు ఉంద. వ్యవసాయ పనుల్లో తల్లికి సహాయం చేసేది. ఇక షమీమ్ కూతురు మరో అబ్బాయి ముసాహిద్‌తో ప్రేమలో ఉంది. అయితే ఇద్దరి అలా కలిసి తిరగడం రాజీవ్‌కు ఎంతమాత్రం ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ అలా తిరుగుతుండటం చూసి రాజీవ్ పలుమార్లు మందలించాడు కూడా. అయినప్పటికీ వారిలో మార్పు రాలేదు.

Woman kills Boy friend with the help of her daughters lover

దీన్ని రాజీవ్ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో షమీమ్ కూతురుని అందరూ చూస్తుండగానే అవమానకరంగా మాట్లాడేవాడు. అందరిలో అవమానించేవాడు. ఈ క్రమంలోనే షమీమ్‌పై కూడా రాజీవ్‌కు అనుమానం వచ్చింది .షమీమ్ ఇంకా ఎంతమంది మగవారితో సంబంధాలు నెరుపుతోందో అన్న అనుమానం ఆయనలో బలంగా నాటుకుపోయింది.

ఇక రాజీవ్ ప్రవర్తనపై షమీమ్ విసుగెత్తిపోయింది. ఆయన్ను అంతమొందించాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే విషయం వారు విచారణ సందర్భంగా ఒప్పుకున్నట్లు తెలిపారు. కొన్ని సార్లు రాజీవ్ నేరుగా ముసాహిద్‌తో గొడవకు దిగేవాడని వారు పోలీసులకు తెలిపారు. ఇక రాజీవ్‌ను అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చేశాక ఏప్రిల్ 22 రాత్రి 9 గంటలకు వారు పనిచేస్తున్న పొలంవద్దకు రాజీవ్‌ను తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. రాజీవ్‌ చేత మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+