కిరాతకం: భర్తను చంపి శవాన్ని సూట్ కేసులో కుక్కి కారులో ఇలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

చంఢీఘడ్:ఓ మహిళ తన భర్తను కాల్చి చంపి , ఆ శవాన్ని సూట్ కేసులో పెట్టి బిఎం డబ్ల్యుూ కారులో వదిలేసిన ఘటన పంజాబ్ లో కలకలం రేపింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితురాలు పోలీసులకు లొంగిపోయింది.

పంజాబ్ రాష్ట్రంలోని మొహలీలోని విలాసవంతమైన ప్రాంతంలో పార్క్ చేసిన బిఎం డబ్ల్యూ కారు వెనుక సీటులో అనుమానాస్పదంగా సూట్ కేసు ఉండడంతో కొందరు రిక్షా కార్మికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

పోలీసులు ఈ కారును తనిఖీ చేస్తే ఈ విషయం వెలుగుచూసింది. ఏకం సింగ్ థిల్లాన్ ను తానే కాల్చి చంపినట్టు ఆయన భార్య సీరత్ థిల్లాన్ పోలీసులకు చెప్పారు. ఆమె తల్లి జస్విందర్ సింగ్ కౌర్, సోదరుడు వినయ్ ప్రతాప్ సింగ్ బ్రార్ లపై కూడ మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Woman kills husband, dumps body in his bmw

శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఏకం సింగ్ ను తన లైసెన్స్ డ్ గన్ తో కాల్చి చంపినట్టు నిందితురాలు తెలిపారు. అయితే ఈ ఘటనలో తనకు తన సోదరుడు, అతని స్నేహితుడు సహకరించాడని సీరత్ థిల్లాన్ చెప్పారు.

బీఎం డబ్ల్యూ కారులో మృతదేహన్ని తీసుకెళ్ళి కాలువలో పడేయాలని బావించామని అయితే కారు తాళాలు దొరకకపోవడంతో ఉదయాన్నే శవాన్ని తరలించాలని భావించామని ఇంతలోనే పోలీసులకు తెలిసిపోయిందని నిందితురాలు చెప్పారు.అయితే భర్తను ఎందుకు హత్య చేయాల్పి వచ్చిందో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman was arrested on Sunday for allegedly shooting her husband dead at their residence in mohali. after being on the run, she surrendered before police and confessed to her crime.
Please Wait while comments are loading...