పెళ్లై 24గంటలే: వరుడిని చంపి నగలతో ఉడాయించిన వధువు
ఆగ్రా: ఏ నవవధువు సాహసించని దారుణానికి ఒడిగట్టింది ఓ యువతి. పెళ్లి చేసుకుని 24 గంటలైనా గడవకముందే.. నూతన వరుడిని హత్య చేసింది. అంతేగాగ, అతని వద్ద ఉన్న డబ్బు, నగలతో ఉడాయించింది. ఈ దారుణం ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నిర్మల్ సింగ్(45) మొదటి భార్యకు విడాకులిచ్చాడు. కాగా, అతడికి భరత్ సింగ్(14) అనే దివ్యాంగుడైన కుమారుడు ఉన్నాడు. ఇటీవల తార అనే మహిళతో సింగ్‌కు పరిచయం ఏర్పడటంతో ఆమెను మంగళవారం రెండో వివాహం చేసుకున్నాడు.

అయితే అదే రాత్రి సింగ్, ఆయన కుమారుడికి తార మత్తుమందు ఇచ్చింది. అనంతరం సింగ్‌ను హత్య చేసిడబ్బు, నగలతో పరారైంది. స్పృహలోకి వచ్చిన భరత్.. ఘటన గురించి స్థానికులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే హత్య చేసిన అనంతరం తార.. భరత్ మొబైల్‌ఫోన్ తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, నిందితురాలి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications