డ్రగ్స్ ఇచ్చి చంపేసింది: ప్రియుడితో కలిసి భర్తపై ఓ భార్య ఘాతుకం
న్యూఢిల్లీ: వివాహేతర సంబంధం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడితో కలిసి ఓ భార్య భర్తను హతమార్చిన సంఘటన ఢిల్లీలోని బేగంపురలో వెలుగుచూసింది.
బేగంపురకు చెందిన ఓ ఫర్నిచర్ వ్యాపారి(30)కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని ఆ వ్యాపారి ఇటీవల మార్చి 9న అకస్మాత్తుగా మరణించాడు. అనంతరం అతని మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చిపెట్టారు.

ఆపై కోడలిపై అనుమానంతో మృతుడి తల్లిదండ్రులు ఆమె సెల్ ఫోన్ పరిశీలించగా.. వేరే వ్యక్తితో ఆమె మాట్లాడినట్టు తేలింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు నిజం బయటపడింది.
ప్రియుడితో కలిసి భర్తకు అధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చి చంపినట్టు భార్య అంగీకరించింది.
దీంతో శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని తవ్వి తీసి పోస్టుమార్టం రిపోర్ట్ కోసం పంపించారు. పోస్టుమార్టమ్ నివేదిక రాగానే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు వివరించారు.












Click it and Unblock the Notifications