సీఎంకు పబ్లిగ్గా ముద్దుపెట్టిన మహిళా ప్రజాప్రతినిధి (వీడియో)

బెంగళూరు: ముఖ్యమంత్రికి ఓ మహిళా ప్రజాప్రతినిధి పబ్లిక్ మీటింగ్‌లో ముద్దు ఇచ్చింది. ఇప్పుడు ఈ వార్త కర్నాటకలో పతాక శీర్షికలకు ఎక్కింది. ముద్దు ఇచ్చిన ప్రజాప్రతినిధి పేరు గిరిజా శ్రీనివాస్ అని తెలుస్తోంది. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆమె కిస్ చేశారు.

Woman kissed CM Siddaramaiah in a program by Karnataka Pradesh

కర్నాటక రాజధాని బెంగళూరులో కర్నాటక ప్రదేశ్ కురుబర సంఘ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. పంచాయతీ మెంబర్ గిరిజ శ్రీనివాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వేదిక పైన ఉన్న సీఎం సిద్దు వద్దకు వెళ్లిన ఆమె ఒక్కసారిగా ఆయనకు ముద్దు పెట్టారు. ఆ తర్వాత నవ్వుకుంటూ ఆయన వెనుకగా మరోవైపు వెళ్లారు.

Woman kissed CM Siddaramaiah in a program by Karnataka Pradesh

ఎగ్జయిట్‌మెంట్ కారణంగానే ముద్దు పెట్టానని, అందులో తప్పేమిలేదని, ఆయన తండ్రిలాంటి వారని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. అక్కడున్న కాంగ్రెస్ నేతలు కూడా దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. తండ్రి లాంటి వ్యక్తికి బహిరంగంగా ముద్దు పెడితే తప్పేమిటని చెబుతూ, పాజిటివ్‌గానే తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+