యువతిని లాక్కెళ్లిన కేసు: ధర్నా, చంపేస్తారేమోనని..

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో కొద్ది రోజుల క్రితం ఓ యువతిని బాయ్స్ హాస్టల్లోకి లాక్కెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ రగడ ఇంకా కొనసాగుతోంది. యువతిని బాయ్స్ హాస్టల్లోకి లాక్కెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన వారి పైన చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు మరోసారి ఆందోళన చేపట్టారు.

ఇందుకు సంబంధించి మళ్లీ ప్రత్యేక విచారణ చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న విద్యార్థుల పైన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వారిని లాక్కెళ్లారు.

Woman molested on campus: 35 University students arrested for protesting

మరో విషయమేమంటే.. ఆందోళన చేస్తున్న వారిలో పలువురు మహిళా విద్యార్థులు కూడా ఉన్నారు. వీరు పోలీసుల పైన వేధింపుల కేసు పెట్టారు.

తాము ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు వేధించారని వారు ఫిర్యాదు చేశారు. విద్యార్థులు వైస్ చాన్సలర్‌ను మంగళవారం రాత్రి అడ్డుకొని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుపు పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

విద్యార్థులు అడ్డుకోవడంతో తాను భయపడిపోయానని వైస్ చాన్సలర్ అన్నారు. పోలీసులు రాకుంటే తనను చంపేసేవారేమో అన్నారు. వారు తమ పైన దాడి చేశారని, దీంతో తమను చంపేస్తారేమోనని ఆందోళన చెందానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+