ట్విస్ట్: ఫేస్‌బుక్‌ పరిచయంతో ఇద్దరిని పెళ్ళి చేసుకొన్న అమ్మాయి, షాకిచ్చిన మొదటి భార్య

Posted By:
Subscribe to Oneindia Telugu

నైనిటాల్: ఫేస్‌బుక్‌లో అబ్బాయి పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిలతో స్నేహం చేసి ఇద్దరిని వివాహం చేసుకొంది ఓ యువతి ఒకరికి తెలియకుండా మరోకరిని వివాహం చేసుకొంది. అయితే మొదటి భార్య వరకట్న వేధింపుల కేసు పెట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది.

ఫేస్‌బుక్ లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అబ్బాయిలు మోసం చేస్తున్నారు. అమ్మాయిల పేరుతో అకౌంట్లు క్రియేట్ చేసి అబ్బాయిలు వారిని మోసం చేస్తున్న ఘటనలు చూశాం , కానీ దానికి భిన్నమైన కేసును ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

అబ్బాయిగా అవతారమెత్తి రెండు పెళ్ళిళ్ళు

అబ్బాయిగా అవతారమెత్తి రెండు పెళ్ళిళ్ళు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలో ఓ యువతి యువకుడిగా ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇద్దరు యువతులను వివాహం చేసుకొంది. కృష్ణ సేన్ అనే యువతి ఫేస్‌బుక్ లో అబ్బాయి పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేసి అమ్మాయిలను స్నేహితులుగా మార్చుకొనేది. ఇలా 2014లో ఆమె వ‌ల‌లో ఓ యువ‌తి ప‌డింది. ఆ యువ‌తిని పెళ్లి చేసుకోవడానికి కాత్‌గోడమ్ ప్రాంతానికి వచ్చి తాను అలీగఢ్‌లో ఉన్న ఓ సీఎఫ్‌ఎల్ బల్బ్ వ్యాపారవేత్త కొడుకునని చెప్పింది. ఎట్టకేలకు ఆ యువతిని వివాహం చేసుకొంది.

వ్యాపారం కోసం రూ.8 లక్షలు లాగింది

వ్యాపారం కోసం రూ.8 లక్షలు లాగింది

యువతిని వివాహం చేసుకొన్న తర్వాత వ్యాపారం చేయాలని ఎనిమిదిన్నర లక్షలను తీసుకొంది. ఆ తర్వాత నుండి ఆమె నుండి తప్పించుకొని తిరుగుతోంది. అయితే మొదటి భార్య వరకట్నం కేసు పెట్టింది.

రెండో యువతిని వివాహం

రెండో యువతిని వివాహం

మొదటి అమ్మాయిని వివాహం చేసుకొని ఆమెకు తెలియకుండానే ఫేస్ బుక్ ద్వారా మరో యువతికి గాలం వేసింది.2016 ఏప్రిల్‌లో ఇదే త‌ర‌హాలో మ‌రో యువ‌తిని పెళ్లి చేసుకుంది. తాను పెళ్లి చేసుకుంది మగాడిని కాదని రెండో భార్య పసిగట్టింది. అయితే, కృష్ణ సేన్ డబ్బు ఇస్తాన‌ని చెప్ప‌డంతో ఆమె ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు.

 మొదటి భార్య కేసుతో బండారం బట్టయలు

మొదటి భార్య కేసుతో బండారం బట్టయలు

మొదటి భార్య కేసుతో కృష్ణసేన బండారం బట్టబయలైంది. మొదటి భార్య కట్నం వేధింపుల కేసు పెట్టింది. దీంతో కృష్ణ సేన్ ను పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో కృష్ణసేన్ అబ్బాయి కాదని అమ్మాయిగా నిర్ధారించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Uttarakhand police have arrested a woman, who pretended to be a man to marry two women and allegedly tortured one of them for dowry in the state’s Nainital district, a senior official said on Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి