వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్ళైన రెండు రోజులకే ట్విస్ట్: ఇద్దరు యువతుల పెళ్ళి, షాక్ తిన్న వధువు కుటుంబం

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:ఇద్దరు యువతులు కుటుంబసభ్యులను మోసగించి వివాహం చేసుకొన్నారు. అయితే పెద్దలకు తెలియకుండానే వివాహం చేసుకొన్నారు. అయితే వివాహం చేసుకొన్న తర్వాత వరుడి రూపంలో ఉంది అబ్బాయి కాదని యువతిగా గుర్తించిన అమ్మాయి తరుపు కుటుంబసభ్యులు వరుడి అవతారమెత్తిన యువతిపై దాడికి దిగారు. అయితే పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఇద్దరు యువతులు పెద్దలను మోసగించి పెళ్ళి చేసుకొన్నారు. ఆ ఇద్దరిలో ఓ యువతి వరుడిగా మారింది. తమ పెళ్ళిని ఇద్దరు యువతులు రిజిష్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు.

తప్పుడు ధృవీకరణ పత్రాలతో వీరిద్దరూ వివాహం చేసుకొన్నారు. అయితే ఈ వివాహం తర్వాత పెళ్ళి చేసుకొన్న వారిద్దరూ కూడ యువతులేననే విషయం వెలుగు చూసింది. ఈ వ్యవహరం వెలుగులోకి రావడంతో వధువు తల్లిదండ్రులు వరుడిగా నమ్మించిన యువతిపై దాడికి దిగారు.

పెళ్ళి చేసుకొన్న ఇద్దరు యువతులు

పెళ్ళి చేసుకొన్న ఇద్దరు యువతులు

ఉత్తర్‌ప్రదేవ్ రాష్ట్రంలోని పక్కపక్కన ఉండే ఇద్దరు యువతులు సన్నిహితంగా మెలిగేవారు. ఇద్దరూ కూడ అమ్మాయిలే కావడంతో కుటుంబసభ్యులు కూడ పెద్దగా అనుమానించలేదు. అయితే వీరిద్దరూ కూడ తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి వివాహం చేసుకొన్నారు. అయితే ఈ విషయం పెద్దలకు కూడ తెలియదు. ఓ యువతి మాత్రం వరుడిగా మారింది. ఈ మేరకు ఆమె వరుడిగా వేషధారణ చేసుకొంది. వివాహం తర్వాత అసలు విషయం తెలిసి అందరూ షాక్‌కు గురయ్యారు.

వరుడిగా మారిన యువతి

వరుడిగా మారిన యువతి

ఈ ఇద్దరు యువతులు సన్నిహితంగా ఉన్నారు. అయితే ఇందులో ఓ యువతి కార్తీక్‌శుక్లా పేరుతో నకిలీ ఆధార్ కార్డును సృష్టించింది. కార్తీక్ శుక్లాగా ఆమె మారింది. తన స్నేహితురాలని వివాహం చేసుకొనేందుకు గాను ఆమె కార్తీక్ శుక్లా గా మారింది. కట్టుబొట్టు అంతా పురుషుడిగా మారింది. వివాహం పూర్తయ్యే వరకు ఎవరికీ అనుమానం కలగకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.పెళ్ళి కోసం తప్పుడు ధృవీకరణ పత్రాలే కాదు, నకిలీ తల్లిదండ్రులను కూడ ఆ యువతి ఏర్పాటు చేసింది. వివాహం వరకు ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోలేదు.

 కార్తీక్ శుక్లా యువతిగా గుర్తింపు

కార్తీక్ శుక్లా యువతిగా గుర్తింపు

కార్తీక్ శుక్లా పురుషుడు కాదని వధువు కుటుంబసభ్యలు వివాహం పూర్తైన తర్వాత అమ్మాయిగా గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే వధువు కుటుంబసభ్యులు వరుడిగా మోసం చేసిన యువతి ఇంటిపై దాడికి దిగారు. ఆ యువతిని చితకబాదారు.ఈ తరుణంలో వధువు మేడ మీద నుండి కిందకు దూకింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.

స్వలింగ సంపర్కం ఇండియాలో నిషేధం

స్వలింగ సంపర్కం ఇండియాలో నిషేధం

స్వలింగ సంపర్కం భారత్‌లో నిషేధం. దీన్ని చట్టరీత్యా నేరంగా ఇండియాలోని చట్టాలు చెబుతున్నాయి. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించకూడదంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై స్పందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై వారం రోజుల్లో కేంద్రం తన అభిప్రాయాన్ని తెలపాల్సి ఉంది.

English summary
The two women showed up to a mass wedding in Agra with ID cards and two sets of fake parents. The woman who posed as the ‘groom’ even procured an Aadhaar card in the name of ‘Kartik Shukla’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X