కొడుకును బంధించి మహిళా ప్రొఫెసర్‌ను కాల్చి చంపేశారు
భర్తతో విడిపోయి విడిగా ఉంటున్న ఓ మహిళా ప్రొఫెసర్ దారుణ హత్యకు గురైంది. ఆమె కుమారుడిని బంధించి, ఆమెను ఇంట్లోనే హత్య చేశారు.
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూర్ ఇరక్కూర్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రొఫెసర్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె కుమారుడిని బంధించి, ఆమెను హత్య చేశారు. ఓపీఎస్ కాలనీకి చెందిన శివలింగం భారతీ యార్ యూనివర్శిటీలో టెక్నికల్ అధికారిగా వ్యవహరి స్తున్నారు. ఆయన భార్య లత (38) తిరుప్పూర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
మనస్ఫర్థల కారణంగా భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు. కుమారుడితో కలసి లత వేరుగా ఉంటున్నారు. కళాశాలకు వెళ్లే సమయంలో లత కుమారుడిని అదే ప్రాంతంలో ఉన్న పుట్టింట్లో ఉంచి వెళుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం మనుమడు, లత ఇంటికి రాకపోవడంతో అను మానించిన ఆమె తండ్రి లత ఇంటికి వెళ్లాడు. అతను వెళ్లి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోంచి పొగలు వస్తున్నాయి.

దాంతో అతను చుట్టుపక్కల వారి సాయంతో లోనికి వెళ్లి చూశాడు. శరీరం కాలిన స్థితిలో పడి ఉన్న కూతురిని చూసి బోరున విలపించాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయ కమిషనర్ సుందర్ రాజన్ నేతృత్వంలోని పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకొని మరో గదిలో బంధించిన ఆమె కుమారుడిని విడిపించారు.
కాగా, ఇంటి ప్రాంగణంలో కారపు పొడి చల్లివుండడంతో పాటు ఆమె ధరించిన 7 సవర్ల నగలు చోరీకి గురయ్యాయి. లత ఒంటరిగా ఉండడాన్ని గమనించిన దుండగులు నగల కోసం ఆమెను హత్య చేశారా లేక వేరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications