మహిళా టెక్కీని దోచుకుని, రైల్లోంచి తోసేశాడు

చెన్నై: ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీరును ఓ దొంగ దోచుకుని ఆమెను రైల్లోంచి కిందికి తోసేశాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి తమిళనాడులోని తంబారం బీచ్ వద్ద సోమవారం రాత్రి సబర్బన్ రైల్లో జరిగింది. మహిళా కంపార్టుమెంటులో పాతికేళ్ల మునీశ్వరి ఒకతే ఉంది. ఆ సమయంలో ఆమెపై దొంగ దాడి చేశాడు.

దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ మహిళ నుంచి అతను బంగారం లాక్కున్నాడు. చేతి బ్యాగ్ కోసం డిమాండ్ చేశాడు. దాన్ని ఇవ్వడానికి ఆమె నిరాకరించింది. దాంతో అతను ఆమెపై దాడి చేసి కదులుతున్న రైలులోంచి తోసేశాడు. దాంతో ఆమె ఎడమ భుజానికి ఫ్రాక్చర్ అయింది.

Woman robbed, pushed out of train near Beach station

తంబారంలోని మెపెజ్ కంపెనీలో ఆమె పనిచేస్తోంది. ఆర్‌బిఐ సబ్ వే తర్వాత రైలు మెల్లగా కదులుతున్న సమయంలో ఓ ఇరవై ఏళ్ల యువకుడు మహిళా కంపార్టుమెంటులోకి ఎక్కడాన్ని ఆమె గమనించింది. ఆమె తన కోసం బీచ్ స్టేషన్‌లో వేచి ఉన్న భర్తతో ఫోన్‌లో మాట్లాడసాగింది. ఆ సమయంలో దొంగ ఆమెపైకి లంగించి బంగారం గొలుసు లాక్కున్నాడు.

ఆ తర్వాత ఆమె హ్యాండ్ బ్యాగ్‌ను లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో అతను ఆమెను తోసేశాడు. రైలు బీచ్ స్టేషన్‌కు చేరుకునేలోగానే యువకుడు రైలు నుంచి దుమికి పారిపోయి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. ట్రాక్ మీద మునీశ్వరిని చూసిన మరో రైలులోని ప్రయాణికులు ఆమెను బీచ్ స్టేషన్‌కు చేర్చారు. ఆమె స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఎగ్మోర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+