మలవిసర్జన చేసినందుకు మహిళ నాలుక కోశాడు
పాట్నా: బీహార్‌లోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి ఓ మహిళ నాలుక కోసేశాడు. తన పొలంలో మలవిసర్జన చేసిందనే ఆగ్రహంతో అతను ఆ దారుణానికి ఒడిగట్టాడు. అతను వారి పొరుగునే ఉంటాడు. పోలీసులు శనివారంనాడు ఆ సంఘటన వివరాలను వెల్లడించారు.
పాట్నాకు 50 కిలోమీటర్ల దూరంలో గల బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లా చాక్యాజ్ గ్రామంలో ఆ సంఘటన చోటు చేసుకుంది. పొరుగున ఉండే భగవత్ పాశ్వాన్ అనే వ్యక్తి శుక్రవారంనాడు కుస్మా దేవి నాలుకను సగం కోసేశాడని, ఆమెకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో ఆ పనిచేశాడని పోలీసులు చెప్పారు.

మహిళ భర్త ఇద్రదేవ్ పాశ్వాన్ పోలీసులకు పొరుగు వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. తన భార్యను అతను బెదిరించాడని, ఆ తర్వాత సగం నాలుకను కోసేశాడని ఇంద్రదేవ్ పాశ్వాన్ తన ఫిర్యాదులో చెప్పాడు. ఇరు కుటుంబాల మధ్య గల వివాదం కారణంగానే ఆ సంఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
బీహార్ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. తాజా సంఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.












Click it and Unblock the Notifications