రేప్‌ను అడ్డుకుందని వివాహితకు నిప్పంటించాడు

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తనపై జరుగుతున్న అత్యాచారాన్ని అడ్డుకోవడంతో.. ఆగ్రహానికి గురైన దుండగుడు ఆమెను తగలబెట్టేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కాన్పూర్ సమీపంలోని పిప్రి గ్రామంలో గురువారం రాత్రి జరిగింది.

వివరాల్లోకి వెళితే.. దీపక్ అనే స్థానిక గూండా.. కూలిపని చేసుకునే వాళ్ల గుడిసెలోకి దూరి, ఓ వివాహితపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె భయంతో కేకలు పెట్టగా, పిల్లలు చుట్టుపక్కల వారిని సాయం అర్థించారు. దీంతో దీపక్ ఆమెపై వెలుగుతున్న లాంతరును విసిరేసి, అక్కడి నుంచి పారిపోయాడు.

Woman set afire for resisting rape attempt

ఆమె చీరకు నిప్పంటుకుని ఒళ్లంతా కాలిపోయింది. కాగా, ఇరుగుపొరుగు వారు ఆమెను వెంటనే కాన్పూర్‌లోని హల్లెట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

కాగా, ఆమె భర్త రోజుకూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఈ దారుణం జరిగే సమయానికి అతడు పని కోసం వేరే ప్రాంతానికి వెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+