కోర్టు ఆవరణలోనే రేప్ బాధితురాలి కాల్చివేత

Woman shot dead in court premises, she was allegedly raped by local godman
మథుర: ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మథుర జిల్లాలోని ఓ కోర్టు ఆవరణలో అత్యాచార బాధితురాలిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ సంఘటన గురువారంనాడు జరిగింది. కోర్టులో వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్లినప్పుడు ఆ పాతికేళ్ల మహిళపై దుండగులు కాల్పులు జరిపారు.

మూడేళ్ల క్రితం స్థానిక స్వామీజి గోవిందానంద తీర్థ తనపై అత్యాచారం చేశాడనే అరోపణ చేసి న్యాయ పోరాటం చేస్తున్న మహిళ జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆ యువతితో పాటు ఉన్న ఆమె తల్లి కాల్పుల్లో తీవ్రంగా గాయపడింది. ఆమెను అలీఘర్ జిల్లాలోని ఆస్పత్రిలో చేర్చారు.

ఈ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వామీజీ ప్రోద్బలంతోనే బాధితురాలిపై, ఆమె తల్లిపై దుండగులు దాడి చేశారా, లేదా అనేది తెలియదు. అయితే, ఈ ఘటనలో మరో స్వామీజి భగీరథి బాబా హస్తం ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆమెను ఎందుకు హత్య చేశారనేది తెలియడం లేదు. అత్యాచారం కింద కేసు నమోదైనప్పటికీ గోవిందానంద తీర్థను ఎందుకు అరెస్టు చేయలేదనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+