Viral Video: రోటీలు చేస్తూ పాడిన పాటకు ఫిదా అయిపోయిన జనం.. వీడియో వైరల్..
తమ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు సోషల్ మీడియా ఒక వేదికగా మారింది. ఎంతో సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ను బయట పెట్టారు. ఆ తర్వాత వారు సెలబ్రెటీలు కూడా అయ్యారు. ఇలా మహిళ వంట చేస్తూ పాడిన పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న 3 నిమిషాల వీడియోలో ఒక మహిళ రోటీలు చేస్తూ 1976లో హిట్ అయిన మేరే నైనా సావన్ భాదోన్ పాటను పాడుతోంది. ఈ వీడియోకు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. చాలా మంది షేర్లు కూడా చేస్తున్నారు.
వీడియోలో ఓ పాప వాళ్ల అమ్మని పాట అడుగుతుంది. గులాబీ రంగు చీర ధరించి, రోటీలు చేయడంలో బిజీగా ఉన్న ఆ మహిళ పాప కోరిక మేరకు పాట పడుతుంది. వీడియోలో ఆమె మేరే నైనా సావన్ భాడోన్ పాటను చాలా వినసోంపుగా పాడారు.ఆర్‌డి బర్మన్ స్వరపరిచిన మేరే నైనా సావన్ భాడోన్‌కి లతా మంగేష్కర్ మరియు కిషోర్ కుమార్ గాత్రాలు అందించారు. ఈ పాట రాజేష్ ఖన్నా, హేమ మాలిని, ప్రేమ్ చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన మెహబూబా చిత్రంలోనిది ఈపాట.

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది.ఆమ గాత్రానికి చాలా మంది ఫిదా అయిపోయారు. ఆమెపై సోషల్ మీడియా యూజర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా చక్కగా పడుతుందని ఒకరు కామెంట్ చేయగా.. లతా మంగేష్కర్ ను గుర్తు చేసిందని మరొకరు కామెంట్ చేశారు. ఈ మధ్య వృద్ధురాలు పాడిన పాట కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వైరల్ వీడియోను జార్ఖండ్ డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications