జిమ్ సెంటర్ లో ప్రేమ..! 32 సార్లు కసితీరా పొడిచి..

Subscribe to Oneindia Telugu

నోయిడా : సహజీవనంలో చోటు చేసుకున్న విబేధాలు అతనిని ఉన్మాదిగా మార్చేశాయి. పూర్తిగా విచక్షణ కోల్పోయిన అతగాడు సహచరిపై అత్యంత పాశవికంగా దాడి చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 32 సార్లు ఆమెను కసితీరా పొడిచి తన ఆగ్రహాన్ని చల్లార్చుకున్నాడు. నోయిడాకు సమీపంలోని ఘజియాబాద్ లో ఉన్న ఇందిరాపురం శక్తిఖండ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. శక్తిఖండ్ లో జిమ్ ట్రయినర్ గా పనిచేసే వరుణ్ గోయల్ కు, అదే ప్రాంతంలో తన సోదరుడి వద్ద ఉంటూ ఓ మొబైల్ టాబ్లెట్ కంపెనీలో పనిచేస్తోన్న ఓ మహిళకు మధ్య జిమ్ సెంటర్ లో పరిచయం ఏర్పడింది. మహిళ రోజు జిమ్ సెంటర్ కు వస్తుండడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత బలపడింది. దీంతో అప్పటికే భర్తకు దూరంగా ఉంటూ వస్తోన్న సదరు మహిళ, జిమ్ ట్రయినర్ వరుణ్ కలిసి నోయిడాలోని సెక్టార్-73లో ఉండే ఓ అపార్ట్ మెంట్ లో ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నారు.

Woman stabbed 32 times by live-in partner in Noida

కాగా, సంవత్సరం వరకు అంతా బాగానే ఉన్నా, తనను పెళ్లి చేసుకోవాలని సదరు మహిళ వరుణ్ ను కోరడంతో ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. పెళ్లి గురించి తరుచూ వరుణ్ పై ఒత్తిడి తెస్తుండడంతో.. ఆగ్రహించిన వరుణ్ కత్తితో ఆమెపై దాడికి తెగబడ్డాడు. అత్యంత దారుణంగా 32 సార్లు ఆమెను కత్తితో పొడిచిన వరుణ్, అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

అయితే దాడి సమయంలో మహిళ గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, మహిళ పరిస్థితి విషమిస్తుండడంతో మెరుగైన వైద్య సేవల కోసం లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి తరలించారు

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman was stabbed 32 times by her live-in partner in Sector 73 of the city's Sarfabad area where she was living with him for the past one year, police said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి