భర్తను వదిలేసిందని గుండుగీయించి ఊరేగించారు

సుర్గుజ: భర్తను విడిచిపెట్టి మరో వ్యక్తితో జీవిస్తున్నందుకు ఓ మహిళను తీవ్రంగా కొట్టి, గుండుగీసి ఊరేగించారు కొందరు మూర్ఖపు గ్రామ పెద్దలు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుర్గుజా జిల్లాలోని సెడం గ్రామంలో చోటుచేసుకుంది.

స్థానిక సుర్గుజా ప్రాంతానికి చెందిన ఓ వివాహిత.. మద్యపానానికి బానిసై వేధిస్తున్న భర్తను వదిలేసి తనని ప్రేమిస్తున్న మరో వ్యక్తితో జీవిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు ఆమె చేతులు కట్టేసి భర్త చేత ఆమెకు గుండు గీయించి వీధుల్లో ఊరేగించారు.

Woman thrashed, paraded with tonsured head for leaving husband

అనంతరం తమ గ్రామంలో ఉండటానికి వీల్లేదంటూ సంఘబహిష్కరణ చేస్తూ తీర్మానించారు. కాగా, ఈ విషయమై సమాచారం అందుకున్న అధికారులు గ్రామానికి పోలీసు బృందాన్ని పంపినట్లు తెలిపారు.

విచారణ చేపడుతున్నామని, ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తెలిసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఆర్ఎస్ నాయక్ తెలిపారు. నాలుగేళ్ల క్రితం బాధితురాలికి తన విజయ్ కుమార్ అనే వ్యక్తితో వివాహం జరిగిందని, అయితే మద్యానికి బానిసైన అతడు ప్రతీరోజు ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+