సెక్స్ రాకెట్: కూతుర్ని అమ్మకానికి పెట్టిన తల్లి
ముంబై: వయసుకు వచ్చిన కుమార్తెను ఐదు లక్షల రూపాయలకు అమ్మకానికి పెట్టిన తల్లిని మహారాష్ట్రలోని థానే పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. నిందితురాలిని పోలీసులు విచారిస్తున్నారు.
ముంబై శివారు ప్రాంతంలోని గోవండిలో ఓ మహిళ (33) నివాసం ఉంటున్నది. ఈమెకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. కుమార్తెను వ్యభిచార ముఠాకు విక్రయించడానికి ఆమె సిద్దం అయ్యింది. రూ. ఐదు లక్షలకు బేరం పెట్టింది.
విషయం తెలుసుకున్న థానే పోలీసులు రంగంలోకి దిగారు. థానేలోని ఓ హోటల్ లో నిందితురాలు కుమార్తెను రూ. 4.25 లక్షలకు అమ్మడానికి బేరం కుదుర్చుకుంది. అడ్వాన్స్ గా రూ. 50 వేలు తీసుకుంది.

పోలీసులు హోటల్ చేరుకుని కుమార్తెను విక్రయించడానికి ప్రయత్నించిన మహిళను అరెస్టు చేశారు. తన సోదరి కుమార్తె పెళ్లి చెయ్యడానికి డబ్బు అవసరమై ఈ పని చేశానని ఆమె అంగీకరించిందని పోలీసులు చెప్పారు.
ఈమె సెక్స్ రాకెట్ నడుపుతుందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఈమె దందా వెనుక పలువురి హస్తం ఉందని పోలీసులు అన్నారు. ఇప్పటికే ఈమెకు మూడు పెళ్లిళ్లు అయ్యాయని, ముగ్గురు కుమార్తెలు ఉన్నారని థానే పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications