Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భర్తను 8 ముక్కలుగా నరికి.. ఇంట్లో దాచిన భార్య, ప్రియుడికి.. 30 ఏళ్లు కఠిన శిక్ష

పూజ(30), బల్జీత్ సింగ్ లు భార్యభర్తలు. 2016 ఏప్రిల్ 26న బల్జీత్ కనిపించడం లేదంటూ అతని సోదరుడు కుల్జీత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ వదిన పూజ వదనంలో విషాదఛాయలు ఏమాత్రం కనిపించకపోవడం,

చండిగఢ్: వివాహేతర సంబంధం మోజులో పడి, తమ రాసలీలలకు అడ్డొస్తున్నాడని.. కట్టుకున్న భర్తను 8 ముక్కలుగా నరికిన ఓ మహిళకు హర్యానాలోని జ్జర్ జిల్లా కోర్టు 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళితే... పూజ(30), బల్జీత్ సింగ్ లు భార్యభర్తలు. 2016 ఏప్రిల్ 26న బల్జీత్ కనిపించడం లేదంటూ అతని సోదరుడు కుల్జీత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ వదిన పూజ వదనంలో విషాదఛాయలు ఏమాత్రం కనిపించకపోవడం, వాళ్ల ఇంటినుంచి దుర్వాసన వస్తుండడంతో బల్జీత్ సోదరీమణులిద్దరికీ పూజ మీద అనుమానం కలిగింది.

Woman who hacked husband into 8 pieces gets 30 years in jail

దీంతో తమ అన్న అదృశ్యం వెనుక పూజ హస్తం ఉండి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పూజ పేరును కూడా చేర్చారు. అనంతరం పోలీసుల విచారణలో పూజ ఇచ్చిన సమాధానాలు పొంతన లేకుండా ఉండడంతో పోలీసులకు కూడా ఆమెపై అనుమానం కలిగింది.

ఒకవైపు అదృశ్యమైన బల్జీత్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తుండగానే, మరోవైపు అతడి తమ్ముడు, సోదరీమణులు కూడా వెతకసాగారు. చివరికి తమ సోదరుడు హత్యకు గురయ్యాడనే నిజాన్ని వారు గుర్తించి పోలీసులకు తెలిపారు.

ఈ కేసులో పోలీసులు పూజను అరెస్టు చేశారు. విచారణలో నిజాలు వెలుగులోకి వచ్చాయి. తమ పొరుగునే నివసించే ఓ వ్యక్తితో తనకు శారీరక సంబంధం ఉందని, తమ సంబంధానికి భర్త బల్జీత్ సింగ్ అడ్డొస్తున్నాడని భావించి ప్రియుడితో కలిసి అతడ్ని చంపేసినట్లు పూజ అంగీకరించింది.

తన భర్త శరీరాన్ని ఎనిమిది ముక్కలుగా నరికి తమ ఇంట్లోనే వివిధ ప్రదేశాల్లో ఆ ఖండాలను ఉంచినట్లు పూజ పేర్కొనడంతో పోలీసులు అవాక్కయ్యారు. అనంతరం బల్జీత్ సింగ్ మృత భాగాలను వారు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో ఇరువురి వాదనలు విన్న జడ్జి.. పూజ, ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసి పక్కా ప్రణాళికతోనే బల్జీత్ సింగ్ ను హత్యచేశారనే వాదనతో అంగీకరించి.. ఇద్దరికీ 30 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+