వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబార్షన్లపై మహిళలు సొంత నిర్ణయం తీసుకోరాదు: సుప్రీంకోర్టుకు కేంద్రం అఫిడవిట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అబార్షన్ చేయించుకునే హక్కు మహిళకు లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదిక ద్వారా తెలిపింది. మహిళ గర్భం దాలిస్తే అబార్షన్ చేయించుకోవాలా వద్ద అనేది నిర్ణయించుకునే హక్కు ఆమెకే వదిలేయాలని ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన లిటిగేషన్ పిల్ దాఖలైంది. ఈ పిల్‌ను కొట్టివేయాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. ఈమేరకు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం 1971లో పొందుపర్చిన విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

మొదటి ప్రియుడు అత్యాచారం.. రెండో ప్రియుడు అబార్షన్.. తల్లిని చంపిన కేసులో కొత్త కోణం..! మొదటి ప్రియుడు అత్యాచారం.. రెండో ప్రియుడు అబార్షన్.. తల్లిని చంపిన కేసులో కొత్త కోణం..!

 గర్భస్రావం చేయించుకునే హక్కు మహిళకు లేదు

గర్భస్రావం చేయించుకునే హక్కు మహిళకు లేదు

తన గర్భాన్ని తొలగించుకోవడం మహిళకు ఉన్న హక్కు కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ తల్లి బిడ్డకు ప్రమాదం అయిన సమయంలోనే వారి ఆరోగ్యదృష్ట్యా అబార్షన్ చేయించుకునే హక్కు ఉంటుందని కేంద్రం చెప్పింది. గర్భస్రావం చట్టబద్ధం చేయడానికి అదే సమయంలో సురక్షితం కాని అబార్షన్లను నివారించడానికి 1971 చట్టం రూపొందించబడిందని కేంద్రం వివరించింది. అంతేకాదు పిటిషనర్ చెబుతున్నట్లుగా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం లోని ప్రొవిజన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21ను పోలుస్తూ వాదిస్తున్నారని అది తప్పని కేంద్రం చెప్పింది.

తల్లీ బిడ్డల మరణాలకు కారణం అబార్షన్లే

తల్లీ బిడ్డల మరణాలకు కారణం అబార్షన్లే

గర్భధారణ సంబంధిత కారణాల వల్ల మరణాలు మరియు అనారోగ్యాలను తగ్గించడం భారత ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. ఎందుకంటే అసురక్షిత గర్భస్రావం భారతదేశంలో 8 శాతం ప్రసూతి మరణాలకు కారణం అవుతుండగా తల్లి మరణానికి మూడవ అతిపెద్ద కారణంగా అబార్షన్స్ ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.

మరణాలను నిలువరించాల్సిన బాధ్యత ఉంది

మరణాలను నిలువరించాల్సిన బాధ్యత ఉంది

అబార్షన్ల కారణంగా పెరుగుతున్న తల్లి బిడ్డ మరణాలను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అఫిడవిట్‌లో పేర్కొంది. తల్లి బిడ్డ ప్రాణాలకు ప్రమాదం అని తెలిస్తే ఎక్కడా రాజీ పడకుండా సురక్షిత అబార్షన్లు చేయాల్సిన బాధ్యత కూడా తీసుకుంటామని కేంద్రం చెప్పింది. ఈ క్రమంలోనే పిటిషనర్ సెక్షన్ 3 మరియు సెక్షన్ 5 కింద డిక్లరేషన్ అడుగుతుంటే దానిని కొట్టివేయాలని కోరుతూ అఫిడవిట్‌లో పేర్కొంది కేంద్రం. ఇక ఈ కేసును చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బోబ్డే విచారణ చేయనున్నారు.

 జూలైల్ పిల్ దాఖలు చేసిన ముగ్గురు మహిళలు

జూలైల్ పిల్ దాఖలు చేసిన ముగ్గురు మహిళలు

అబార్షన్ చేసుకునే నిర్ణయాన్ని మహిళకే వదిలేయపేర్కొంటూ ముగ్గురు మహిళలు స్వాతి అగర్వాల్, గరీమా సెక్సేరియా, పరాచీ వాట్స్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంటీపీ చట్టంలోని సెక్షన్ 3 మరియు సెక్షన్ 5లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొంటూ వాటిని కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే గర్భం దాల్చిన మహిళకు ప్రాణహాని ఉందని పరీక్షల్లో తేలితేనే అబార్షన్‌ చేయొచ్చనేది సెక్షన్ 3 మరియు సెక్షన్ 5లో పొందుపర్చారు. ఆ సమయంలో డాక్టర్లు అనుసరించాల్సిన తీరును కూడా వివరిస్తూ ఎంటీపీ చట్టంలో పొందుపర్చారు. జూలైలో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు విచారణ చేసేందుకు అంగీకరించింది.

English summary
The central government has submitted in the Supreme Court that a woman's right to abort is not an absolute right.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X