ఫ్రీ ఫ్రీ... ఆర్ టీసీ బస్సులో సీటు కోసం మహిళలు వృద్ధుడిని ఏం చేశారంటే ?
బెంగళూరు/యాదగిరి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం శక్తి పథకాన్ని అమలు చేసింది. స్త్రీ శక్తి పథకం అమలు తర్వాత కర్ణాటకలోని (Karnataka) అనేక జిల్లాల్లో అనేక అవాంతరాలు సృష్టించబడ్డాయి. ఇప్పుడు యాదగిరి జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది.
బస్సులో సీటు కోసం ఓ వృద్ధుడిని మహిళలు కొట్టిన అమానవీయ ఘటన చోటుచేసుకుంది.
యాదగిరి నుంచి సేడం వెళ్తున్న ఆర్ టీసీ బస్సులో (bus) ఈ దాడి జరిగింది. వృద్ధుడు బస్సులో కూర్చున్నాడు. ఈ సమయంలో బస్సులో నలుగురు మహిళలు ఉన్నారు. సీటు వదిలేయమని మహిళలు (women)ఆ పెద్దాయనకు చెప్పారు. కానీ పక్క సీటు ఖాళీగా ఉంది, మీరు అక్కడ కూర్చోండి ఆని ఆయన చెప్పారు. వయసులో పెద్దాయన అని కూడా చూడకుండా ఇంతలో నలుగురు మహిళలు వృద్ధుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు.

ఈ ఘటనపై సహ ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడిపై దాడి చేసిన మహిళలను (women) అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ సంఘటన యాదగిరి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అయితే వృద్ధుడిపై దాడి చేసిన మహిళల (women) గురించి, వారి వివరాలు గురించి బయటకురాలేదు.


తరువాత మహిళలు మొత్తం కాంగ్రెస్ (Congress) పార్టీ హస్తం గుర్తు మీద ఓట్లు వేశారు. ఇప్పుడు కర్ణాటకలోని ఆర్ టీసీ బస్సుల్లో మహిళలు (women)ఫ్రీ ఫ్రీ అంటూ తెగతిరిగేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఆర్ టీసీ (RTC) బస్సుల్లో ప్రయాణిస్తున్న కొందరు మహిళలు నోటిదురుసుతో, ఇలా వయసు మీద పడినవారి మీద దాడులు చేస్తూ రాద్దాంతం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొందరు మహిళా (women) ప్రయాణికుల కారణంగా ఆర్ టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలకు చెడ్డపేరు తేస్తున్న కొందరు మహిళ (women)మీద కఠిన చర్యలు తీసుకోవాలని సాటి మహిళా ప్రయాణికులే డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications