బాయ్ ఫ్రెండ్‌తో గొడవ జరిగాక కేసులు: అత్యాచారాలపై హర్యానా సీఎం వింత వ్యాఖ్యలు
మహిళలపై జరుగుతున్న అత్యాచారాల అంశంపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ నోరు జారారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అత్యాచారాల ఘటనలపై చూపించే సానుభూతి పెరుగుతోందని ఆయన అన్నారు. కానీ ఘటనలు మాత్రం పెరగడం లేదని చెప్పారు. పంచకుల జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అత్యాచార ఘటనలు పెరగడం లేదని, గతంలోను జరిగేవని, ఇప్పుడు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కేవలం సానుభూతి మాత్రమే పెరుగుతోందని, అత్యంత ఆందోళన కలిగించే అంశం ఏమంటే 80 నుంచి 90 శాతం అత్యాచార ఘటనలు, ఈవ్ టీజింగ్ కేసులు తెలిసిన వారి మధ్యే జరుగుతున్నాయని చెప్పారు.

సుదీర్ఘకాలంగా పరిచయం ఉన్నవాళ్లే ఇవి జరుగుతున్నాయని చెప్పారు. కలిసి తిరుగుతారని, ఆ తర్వాత ఎప్పుడైతే గొడవ జరుగుతుందో ఆ రోజు అతను తనను అత్యాచారం చేశాడని ఎఫ్ఐఆర్ నమోదు అవుతుందని విమర్శించారు. ఏదో ఆశిస్తారని అభిప్రాయపడ్డారు. మహిళలు దుస్తులు మంచిగా వేసుకోవాలని చెప్పారు. వారు వేసుకున్న దుస్తులు సరిగా ఉండటం లేదని గతంలో చెప్పారు.












Click it and Unblock the Notifications