అత్యాచారయత్నం, తుపాకితో కాల్చేశాడు
ఉత్తరప్రదేశ్: ఈవ్ టీజింగ్ చేస్తూ చివరికి అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించిన సమయంలో అడ్డుకున్న మహిళను నిందితుడు తుపాకి తో కాల్చేశాడు. అయితే బాధితురాలిని సరైన సమయంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది.
ఉత్తరప్రదేశ్ లోని కొత్వాలీ మలాన్ జిల్లా లోని సెంథారి లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సెంథారి గ్రామంలో నివాసం ఉంటున్న మహిళ (40) ఇంట్లో పని ముగించుకుని ఇంటి ఆరు బయట కూర్చుంది. అదే సమయంలో సునీల్ అనే వ్యక్తితో పాటు నలుగురు అక్కడికి వెళ్లారు.
ఈవ్ టీజింగ్ చేస్తూ ఆమెను అల్లరి పెట్టారు. ఆమె ఇంటికి వెళ్లిపోయింది. అక్కడి నుండి నిందితులు వెళ్లి పోయారు. తరువాత మహిళ బయటకు వచ్చి కూర్చుంది. తరువాత మళ్లీ అదేచోటకు అల్లరి మూకలు వెళ్లారు. ఆమె మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారు.

మహిళలను ఇంటిలోకి ఎత్తుకు వెళ్లి అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించారు. ఆమె అడ్డుకోవడంతో సునీల్ అనే నిందితుడు జోబులో ఉన్న పిస్తోల్ బయటకు తీసి ఆమె మీద కాల్పులు జరిపాడు. వెంటనే స్థానికులు విషయం గుర్తించి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. తరువాత ఆగ్రా మెడికల్ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ఆపరేషన్ చేసి బుల్లెట్ లు బయటకు తీశారు. ఆమె ప్రాణాలతో బయటపడిందని, కోలుకుంటుందని పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవ్వరిని అరెస్టు చెయ్యలేదని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications