వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజమైన వారియర్స్ మహిళలు: కరోనానే కాదు ఎలాంటి విపత్తయినా అతివ సాహసం అద్భుతం

|
Google Oneindia TeluguNews

ఆకాశంలో సగం, అవనిలో సగం కాదు ... అన్నింటా మేమే.. అండగా నిలిచేది మేమే.. కష్టమైనా నష్టమైనా తోడుగా ఉండేది మేమే.. మీ ఇష్టాలను, చిరాకులను అర్థం చేసుకునేది మేమే.. మహిళ లేకుంటే మానవ సమాజానికి ఉనికే లేదని అర్థమయ్యేలా చేశారు గత సంవత్సర కాలంగా మహిళలు. కరోనా కష్టకాలంలో, లాక్ డౌన్ సమయంలో ఎంతో సహనంతో కుటుంబాన్ని ముందుకు నడిపించిన మహిళలు నిజంగా స్ఫూర్తిప్రదాతలు.

కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్ గా వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు పోరాటం చేస్తే, కుటుంబాలను కాపాడుకోవడం కోసం మహిళలు చేసిన సాహసం అంతా ఇంతా కాదు. వారు చూపించిన సహనం ప్రతి ఒక్కరు ప్రశంసించాల్సిందే . అలాంటి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు వన్ ఇండియా సగర్వంగా సెల్యూట్ చేస్తూ అందిస్తున్న ప్రత్యేక కథనం.

కరోనా లాక్ డౌన్ సమయంలో కుటుంబాలకు రక్షణగా నిలిచిన మహిళలు

కరోనా లాక్ డౌన్ సమయంలో కుటుంబాలకు రక్షణగా నిలిచిన మహిళలు

మహిళ సహనానికి నిలువుటద్దం. త్యాగానికి ప్రతిరూపం. సాహసానికి పర్యాయపదం. గత సంవత్సరం ఇదే మార్చి నెలలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో మహిళలు అందించిన సేవలు నిరుపమానమైనవి. కరోనా లాక్డౌన్ కారణంగా పిల్లలు, భర్త, అత్తమామలు అంతా ఇంటికే పరిమితమైన సమయంలో ఒంటిచేత్తో కుటుంబాన్ని ముందుకు నడిపించింది మహిళ. ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్న గుట్టుగా సంసారాన్ని ముందుకు నడిపించింది మహిళ.

కరోనా బారిన పడినా ధైర్యంగా సేవలు చేసి తన వాళ్ళను కాపాడుకున్న స్త్రీలు

కరోనా బారిన పడినా ధైర్యంగా సేవలు చేసి తన వాళ్ళను కాపాడుకున్న స్త్రీలు

కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలు మీద ప్రభావం చూపించిన సమయంలో కూడా తానున్నానంటూ, మీకోసం నేనంటూ ఎంతో సహనంతో కుటుంబానికి సేవలు చేసింది. కరోనా బారిన పడిన కుటుంబ సభ్యులకు ధైర్యంగా సేవలందించింది. అంతేకాదు కరోనా కష్టకాలంలో ఆకలితో ఉన్న అన్నార్తుల ఆకలి తీర్చారు ఎంతో మంది మహిళలు. నెలల తరబడి ఇళ్లకే పరిమితం అయిన కుటుంబ సభ్యులందరికీ కోరికను మన్నించి వారికి కావలసింది చేసి , అందర్నీ సంతోష పెట్టే ప్రయత్నం చేశారు మహిళలు. ఉద్యోగాలు చేస్తూనే కుటుంబాన్ని నడిపిస్తూ .. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలందించిన స్త్రీ మూర్తులు

అదే సమయంలో వారి ఆరోగ్య రక్షణకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు

అదే సమయంలో వారి ఆరోగ్య రక్షణకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు

ఇక ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నడిపించిన మహిళల ఘనత అంతా ఇంతా కాదు. వర్క్ ఫ్రం హోం గా పని చేస్తూనే, కుటుంబాన్ని ముందుకు నడిపించారు చాలా మంది మహిళలు. కరోనా వ్యాప్తి చెందే వైరస్ అని తెలిసినా ప్రాణాలకు తెగించి ఎంతో మంది మహిళా వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారిణులు... ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షలాది మంది మహిళలు కరోనా కష్టకాలంలో తమ సాహసాన్ని ప్రదర్శించారు. తమ సహనాన్ని తెలియజేశారు.

కరోనానే కాదు .. ఏ కష్టం వచ్చినా ముందు ఉండేది మహిళలే .. వారికి సెల్యూట్

కరోనానే కాదు .. ఏ కష్టం వచ్చినా ముందు ఉండేది మహిళలే .. వారికి సెల్యూట్

విధి నిర్వహణలో మేము సైతం అంటూ సత్తా చాటారు . ఒక్క కరోనా సమయంలోనే కాదు, ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి పోరాటం చేయడంలో మహిళలకంటే శక్తివంతులు లేరనేది నిర్వివాదాంశం. కుటుంబం కోసం మహిళలు పడే శ్రమ , వారికి అండగా మహిళలు అందించే సహకారం కొలమానం లేనిదీ. అందుకే సహనానికి, సాహసానికి, పూర్తికి ప్రతీక గా మారిన మహిళలందరికీ మహిళా దినోత్సవం నాడు సెల్యూట్ చేస్తుంది వన్ ఇండియా.

English summary
In Corona difficult time, in lockdown time women who have led the family with great patience . While women doctors, medical staff, police, and sanitation workers fight as Corona Frontline Warriors, the adventure of housewives to save families is incredible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X