వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రీ.. ఫ్రీ... ఫ్రీ, మహిళలకు మాత్రమే, ఢిల్లీ సీఎం మాస్టర్ ప్లాన్, మెట్రోలో అవకాశం ఇస్తాం!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీ వాల్ మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రభుత్వ బస్సుల్లో (ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పోరేషన్) మంగళవారం మహిళలు ఉచితంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణించవచ్చని ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

మహిళల భద్రత కోసం

మహిళల భద్రత కోసం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం మీడియాతో మాట్లాడారు. పండుగ సందర్బంగా మంగళవారం మహిళలు ఉచితంగా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం కల్పించామని అన్నారు. మహిళల భద్రత కోసం 13, 000 మంది బస్సు మార్షల్స్ ను నియమించామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.

కేజ్రీవాల్ హామీ

కేజ్రీవాల్ హామీ

గతంలో మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తామని ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఆగస్టు 29వ తేదీ ఢిల్లీలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహిళలు ఉచితంగా బస్సుల్లో సంచరించడానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.

మెట్రో రైలులో మహిళలకు

మెట్రో రైలులో మహిళలకు

మహిళలు ఉచితంగా ప్రభుత్వ బస్సుల్లో సంచరించడానికి అవకాశం కల్పించాలని, అందుకు రవాణా శాఖకు రూ. 479 కోట్లు ప్రత్యేక నిధులు ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బస్సుల్లోనే కాకుండా మెట్రో రైలులో మహిళలకు ఉచితంగా సంచరించడానికి అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

English summary
New Delhi: Women will be able to travel for free in Delhi Transport Corporation (DTC) buses and cluster buses starting Tuesday (October 29) onwards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X