టీసిఎస్‌కు షాక్.. ఉద్యోగులకు రిలీఫ్: వెళ్లనివ్వమంటున్న యూపీ సర్కార్?..

Subscribe to Oneindia Telugu

పుణే: ఉత్తరప్రదేశ్ లోని టీసీఎస్ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ఇటీవల సంస్థ ప్రతినిధులు ప్రకటించిన సంగతి తెలిసిందే. లక్నో యూనిట్ ను మూసివేసి ఉద్యోగులను తరలిస్తామని సంస్థ చెప్పింది. సంస్థ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా చాలామంది ఉద్యోగులపై వేటు పడుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

షాక్: టిసిఎస్ కార్యాలయం మూసివేత, 2వేల మంది టెక్కీల ఆందోళన

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కల్పించుకుంది. టీసీఎస్ లక్నో యూనిట్ మూసివేతకు అనుమతించమని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. విషయాన్ని ఆర్థికమంత్రికి అప్పగించి పరిశీలించాలని కోరినట్లు తెలిపింది. దీనిపై స్పందించిన ఆర్థికమంత్రి రాజేశ్ అగర్వాల్.. నగరం నుంచి ఐటీ కార్యాలయం తరలిపోవడానికి అనుమతించమని అన్నారు.

wont let TCS go away from Lucknow: UP minister

టీసీఎస్ నిర్ణయం వెనుక కారణాలను తెలుసుకుంటామని, ఇందుకోసం సంస్థతో సంప్రదింపులు జరుపుతామని అన్నారు. లక్నో ఆఫీస్ మూతపడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలావరకు ఉపాధి కోల్పోతారని భావించిన టీసీఎస్ ఉద్యోగులు ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా ఇతర మంత్రులకు లేఖలు రాశారు. దీంతో మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, మొహ్సిన్ రాజా వారికి భరోసానిచ్చారు. సంస్థతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని హామి ఇచ్చారు.

TCS worker including two Indians downed in US | Oneindia News

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amid fears among Tata Consultancy Services Ltd (TCS) employees that India’s largest software services firm may shut down its unit in Lucknow,
Please Wait while comments are loading...