ప్రపంచ జనాభా దినోత్సవం 2019: అప్పటికల్లా జనాభాలో చైనాను బీట్ చేయనున్న భారత్

ప్రపంచ జనాభా అంతకంతకు పెరిగిపోతోంది. జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా గుర్తిస్తున్నాం. అయితే పెరుగుతున్న జనాభాను నియంత్రించడంలో మాత్రం మానవాళి విఫలమవుతోంది. తాజాగా అమెరికా జనాభా గణాంకాల సంస్థ ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. జూలై నెలాఖరు కల్లా ప్రపంచ జనాభా 7.58 బిలియన్‌కు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. అదే సమయంలో 2020-21 సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుంటే వార్షిక జనాభా వృద్ధి కూడా 1.0శాతానికి పడిపోనుందని చెప్పింది. ఇదే జరిగితే 1950 తర్వాత ఇలా పడిపోవడం ఇదే తొలిసారి అవుతుందని పేర్కొంది.

ప్రపంచ జనాభా దినోత్సవం చరిత్ర

ప్రపంచ జనాభా దినోత్సవం చరిత్ర

జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా గుర్తిస్తూ 1989లో ఐక్యరాజ్యసమితి ప్రకటన చేసింది. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవంగా పరిగణిస్తున్నాం. 1987లో ప్రపంచ జనాభా 5 బిలియన్లు దాటినట్లు నాటి నివేదిక వెల్లడిచేసింది. ఈ సారి మాత్రం 7.58 బిలియన్‌ను దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అంటే ఈ నెలాఖరు కల్లా 7.58 మంది భూమిపై ఉంటారని చెబుతోంది. గత 32 ఏళ్లలో దాదాపు 50 శాతం జనాభా పెరిగిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

 జనభాతో పాటు సమస్యలు ఎక్కువే..!

జనభాతో పాటు సమస్యలు ఎక్కువే..!

ఇక ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగంగా పెరుగుతున్న జనాభాతో ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది గత 32 ఏళ్లుగా జరుగుతున్నదే. అయినప్పటికీ ప్రతి ఏటా జనాభా పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు లేవు. జనాభాతో పాటే తద్వారా వచ్చే సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. భారత్‌నే తీసుకుంటే ప్యూ రీసెర్చ్ సెంటర్ ఇచ్చిన నివేదిక ప్రకారం 2100 నాటికి మనదేశంలో జనాభా 1450 మిలియన్ తాకుతుందని అంచనా వేసింది.1950లో ఉన్న జనాభా 2100 నాటికి చైనా జనాభాను కూడా భారత్ దాటుతుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ తన నివేదికలో వెల్లడించింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాభా ఉన్న 10 దేశాల్లో ఒక్క ఆఫ్రికా దేశాలే ఐదుగా ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది.

టాప్ టెన్‌ దేశాలు

టాప్ టెన్‌ దేశాలు

2100 నాటికి అత్యంత జనాభా ఉన్న తొలి పది దేశాలు ఇవే..!

భారత్-1450 మిలియన్
చైనా 1065 మిలియన్
నైజీరియా -733 మిలియన్
అమెరికా - 434 మిలియన్
పాకిస్తాన్ - 403 మిలియన్
కాంగో - 362 మిలియన్
ఇండోనేషియా- 321 మిలియన్
ఇథియోపియా - 294 మిలియన్
టాంజానియా - 286 మిలియన్
ఈజిప్టు - 225 మిలియన్

ప్రపంచ జనాభాలో 16శాతం భారత్‌లోనే

ప్రపంచ జనాభాలో 16శాతం భారత్‌లోనే

ఇక ప్రపంచ జనాభాపై ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రతి ఏటా దాదాపు 83 మిలియన్ పెరుగుతోంది. ఇక 2030 నాటికి ప్రపంచ జనాభా 8.6 బిలియన్ మార్కును తాకుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. అయితే ప్రపంచ భూభాగంలో కేవలం 2శాతం భూమిని మాత్రమే కలిగి ఉండే భారత దేశం... ప్రపంచ జనాభా విషయానికొచ్చేసరికి దాదాపు 16 శాతం జనాభా మనదేశమే అకామొడేట్ చేయడం విశేషం. ఇక భారత్‌లో 35శాతం జనాభా బీహార్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే ఉన్నట్లు సమాచారం. అత్యధిక జనాభా ఉండటం వల్ల సమస్యలు కూడా అధికంగానే ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందులో ప్రధానమైన సమస్య పేదరికం అని వెల్లడిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+