విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాస్ తీవ్ర పెను తుఫాను: బెంగాల్‌లో 9 లక్షల మంది, ఒడిశాలో 2 లక్షల మంది తరలింపు, వర్షాలు

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాను రానున్న 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరవాయువ్య దిశగా కదులుతున్న యాస్ తుఫాను ఒడిశాలోని పారాదీప్‌కు 220 కిలోమీటర్ల దూరంలో, బాలాసోర్‌కు ఆగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరంలో పశ్చిమబెంగాల్‌లోని దిఘాకు ఆగ్నేయదిశగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందన్నారు.

యాస్ తుఫాను బుధవారం ఉత్తర ఒడిశా-బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఈ రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. సహాయక బృందాలను పంపింది.

 Yaas cyclone Very Severe : 9 lakh people evacuated in WB, 2 lakh in Odisha

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆయా రాష్ట్రాల అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 9 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Recommended Video

Cyclone Tauktae : PM Modi Conducts Aerial Survey Of Affected Areas Of Gujarat || Oneindia Telugu

ఇక యాస్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలు, యానం ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో ఈ ప్రాంతాల్లో 60-70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక దక్షిణకోస్తాంధ్రాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

English summary
Cyclone Yaas intensified into a very severe cyclonic storm this evening, India Meteorological Department (IMD) Director General M Mohapatra said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X