త్రిశికాతో మైసూరు యువరాజు వివాహం 27న
బెంగళూరు: మైసూరు రాజవంశానికి చెందిన యువరాజు యుధ్‌వీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ త్వరలో పెళ్లి పీఠలెక్కనున్నారు. రాజస్థాన్ రాజవంశానికి చెందిన రాకుమారి త్రిశికా కుమారితో జూన్ 27న యువరాజు వివాహం జరగనుంది.
మైసూరులో రెండు రాజకుటుంబాల సభ్యుల సమక్షంలో పురోహితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ సోమవారం నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

కాగా, వివాహ మహోత్సవాన్ని జూన్ 22న నుంచి ఐదు రోజులపాటు మైసూరులోని రాజప్రాసాదంలో నిర్వహించనున్నట్లు రాజకుటుంబ వర్గాలు వెల్లడించాయి. దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించే ఈ రాజకుటుంబంలో వివాహ మహోత్సవం మరింత వైభవంగా జరగనుంది.












Click it and Unblock the Notifications