వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాకూబ్ మృతదేహం: ముంబైకి తరలింపు

|
Google Oneindia TeluguNews

నాగ్ పూర్: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమెన్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గురువారం ఉదయం నాగ్ పూర్ సెంట్రల్ జైలులో యాకూబ్ మెమెన్ కు ఉరి శిక్ష అమలు చేశారు.

తరువాత ప్రభుత్వ లంచనాలు పూర్తి చేసి పోస్టుమార్టుం నిర్వహించారు. యాకూబ్ మెమెన్ కుటుంబ సభ్యులు మృతదేహాన్నిఅప్పగించాలని మనవి చేశారు. యాకూబ్ మెమెన్ మృతదేహాన్నిఅప్పగించడానికి అధికారులు అంగీకరించారు.

 Yakub’s body to be handed over to family in Nagpur

తరువాత నాగ్ పూర్ సెంట్రల్ జైలు నుండి యాకూబ్ మెమెన్ మృతదేహాన్ని అంబులెన్స్ లో తీసుకుని అంత్యక్రియలు నిర్వహించడానికి ముంబై బయలుదేరారు. ముంబైలోని బాదా కబరిస్తాన్ లేది మెరైన్ప్ లైన్స్, మహింలో అంత్యక్రియలు నిర్వహిస్తామని అధికారులకు మొదట కుటుంబ సభ్యులు చెప్పారు.

చివరికి మహిం లోనే అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో గట్టి బందోబస్తు ఎర్పాటు చేశారు. ముంబై నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. యాకూబ్ మెమెన్ మృతదేహాన్నిఊరేగింపుగా తీసుకు వెళ్లరాదని అధికారులు ముందే హెచ్చరించారు. నినాదాలు చెయ్యడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం కుదరదని, ముందే అన్ని నియమాలు యాకూబ్ కుటుంబ సభ్యులకు చెప్పారు.

English summary
The Maharshtra state government has decided to hand over Yakub Memon’s body to his family if the 1993 Mumbai blasts convict's relatives accept certain conditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X