year ender 2024: ప్రధాని మోడీ కీలక విదేశీ పర్యటనలు ఇవే
భారతదేశ దౌత్యానికి సంబంధించి కూడా 2024 చాలా కీలకంగా మారింది. ఈ ఏడాదిలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా తోపాటు రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, ఉక్రెయిన్ సహా పలు ప్రధాన దేశాల్లో పర్యటించడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న రాజకీయ, భౌగోళిక పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు వివిధ దేశాలతో దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేశాయి. అది ఉక్రెయిన్, రష్యా అయినా.. అమెరికా, ఇటలీ అయినా.. ప్రపంచంలో భారతదేశానికి సహజ మిత్రదేశమే అనే శాంతి సందేశాన్ని ప్రధాని మోడీ పర్యటనలు కలిగించాయి. ప్రధాని మోడీ పర్యటనలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

అమెరికాలో ప్రధాని మోడీ పర్యటన
అమెరికా అధ్యక్ష ఎన్నికలతో బిజీగా ఉన్న సమయంలో 2024 సెప్టెంబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత కీలక పర్యటన చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో కలిసి క్వాడ్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్.. డెలావేర్ విల్మింగ్టన్‌లోని తన ఇంటికి ప్రధాని మోడీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య కీలక అంశాలపై సమావేశం జరిగింది. ప్రధాని మోడీ ఈ పర్యటన సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 23 వరకు జరిగింది.

రష్యాలో కీలకంగా మోడీ తొలి దౌత్య పర్యటన
ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాదిజులైలో చిరకాల మిత్రదేశం రష్యాలో పర్యటించారు. ఈ పర్యటన తన వ్యూహాత్మకంగా స్వయం ప్రతిపత్తి పట్ల భారతదేశం బలమైన నిబద్ధతను ప్రదర్శించింది. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి ప్రధాని మోడీ భారత్-రష్యా రెండో వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ద్వైపాక్షిక చర్చల కోసం రష్యాను తొలి విదేశీ పర్యటనగా మోడీ ఎంచుకోవడం ప్రత్యేకతను సంతరించుకుంది.

శాంతి స్థాపనకు ఉక్రెయిన్‌లో ప్రధాని మోడీ పర్యటన
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆహ్వానం మేరకు 2024 ఆగస్టులో ప్రధాని మోడీ ఆ దేశంలో పర్యటించారు. భారతదేశం సాంప్రదాయంగా రష్యా మిత్రదేశంగా పరిగణించడం జరుగుతున్న క్రమంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి కర్తగా భారత్ పాత్రను ప్రపంచానికి ఈ పర్యటన చాటి చెప్పింది.

ఇటలీ టూర్: జీ7 అవుట్‌రీచ్ సెషన్‌కు హాజరైన పీఎం మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 2024లో ప్రధాని మోడీ ఇటలీలో పర్యటించారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానం మేరకు 50వ జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు ఇటలీని మోడీ సందర్శించారు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రధానికి ఇదే తొలి విదేశీ పర్యటన. అల్జీరియా, అర్జెంటీనా, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, మౌరిటానియా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, ట్యూనీషియా, టర్కీ నాయకులు కూడా హాజరైన జీ7 ఔట్ రీచ్ సెషన్‌లో ప్రధాన మోడీ పాల్గొన్నారు.

రష్యాలో జీ జిన్‌పింగ్‌ని కలుసుకున్న ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ 2024 అక్టోబర్‌లో రష్యాలో పర్యటించారు. రష్యాలోని కజాన్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోడీ.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలవడంతో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. లడఖ్‌లోని ఘర్షణ పాయింట్ల నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్న తర్వాత ఈ పర్యటన జరిగింది. ఈ పర్యటన తర్వాత రెండు దేశాల సరిహద్దులో శాంతియుత వాతావరణం కోసం ఇరు దేశాలు కీలక ముందడుగు వేశాయి. కాగా, తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ నెలలో కువైట్ లో పర్యటిస్తున్న వియం తెలిసిందే.












Click it and Unblock the Notifications