యడ్డీకి రిలీఫ్ : కోర్టు ముందు నిలువని డైరీ సాక్ష్యం ? ఎందుకంటే, కారణాలివీ ?
న్యూఢిల్లీ : ఎన్నికల వేళ ప్రకంపనాలు రేపిన 'యడ్డీ డైరీ' కేసులో బీజేపీకి కాస్త ఊరట కలిగే అవకాశం ఉంది. డైరీని కోర్టు సాక్ష్యాధారంగా పరిగణించే అవకాశం లేదు. గతంలో సుప్రీంకోర్టుకు వచ్చిన కేసు పూర్వపరాలు పరిశీలిస్తే .. ఒకవేళ కోర్టును ఆశ్రయించినా, యడ్యూరప్పకు ఇబ్బందులు ఉండవని న్యాయశాస్త్ర నిపుణులు చెప్తున్నారు.
సాక్ష్యాధారాలుగా పరిగణించలేం ..
వివిధ కేసుల్లో ల్యాప్ ట్యాప్, డైరీ, వ్యక్తిగత వస్తువుల, సంతకం, వస్తువులను సాక్ష్యాలుగా పరిగణించలేమని ఇదివరకు కోర్టుకు ముందుకొచ్చిన కేసుల్లో ధర్మాసనం స్పష్టంచేసింది. డైరీని సాక్ష్యంగా పరిగణించమని కోరడం సరికాదని, ఇదివరకూ చాలాకేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని వెల్లడించింది.

పుస్తకం .. ఆధారం కాదు
డైరీ ఒక పుస్తకం అని, బుక్ లో వ్యక్తిగత వివరాలు, ఖాతాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. దీనిని రోజువారీ వ్యాపారంగా అభివర్ణించవచ్చని, కానీ అందులో ఉన్న అంశాల ఆధారంగా ఒకరిపై అభియోగాలు మోపి చర్యలు తీసుకోవాలని కోరడం సరికాదని సూచించింది. ఓ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు వ్యక్తిగత సాక్ష్యాలు తప్పనిసరిగా కావాలని, అలా అయితేనే ఎఫ్ఐఆర్ నమోదుచేసి విచారణ జరిపేందుకు వీలుంటుందని తెలిపింది. కానీ ఎఫ్ఐఆర్ కు బదులు డైరీని ప్రత్యామ్నాయ రుజువుగా పరిగణించలేమని స్పష్టంచేసింది. ఇదివరకు కోర్టుముందుకొచ్చిన సహరా బిర్లా కేసును ఉదహరిస్తున్నారు న్యాయ కోవిదులు.












Click it and Unblock the Notifications