వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక రిజల్ట్స్: గవర్నర్‌ను కలవనున్న యడ్యూరప్ప, గవర్నర్ ఏం చేస్తారు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఓటర్ల తీర్పుతో రాజకీయపార్టీలు ప్రభుత్వ ఏర్పాటు విషయమై మల్లగుల్లాలు పడుతున్నాయి. అతి పెద్ద రాజకీయ పార్టీగా బిజెపి అవతరించింది. మంగళవారం నాడు రాష్ట్ర గవర్నర్‌ను బిజెపి నేత, మాజీ సీఎం యడ్యూరప్ప కలవనున్నారు.

కర్ణాటక రాష్ట్రంలో ఓటర్లు ఏ పార్టీకి కూడ స్పష్టమైన మెజార్టీని ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారంగా బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ, ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీకి అవసరమైన సీట్లు రాలేదు. మరో వైపు కాంగ్రెస్, జెడి (ఎస్) మధ్య అవగాహన చర్చలు జరుగుతున్నాయి. జెడి(ఎస్)కు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కూడ సిద్దమైంది. ఈ విషయమై గవర్నర్ ను కలిసి వివరించనున్నట్టు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.

Yeddyurappa plans to meet governor today

ఈ కీలకమైన పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని మాజీ సీఎం, బిజెపి నేత యడ్యూరప్ప కోరే అవకాశం ఉంది. ఈ మేరకు మంగళవారం నాడే బిజెపి నేత యడ్యూరప్ప గవర్నర్ ను కలవనున్నారు.

గుజరాత్ రాష్ట్రానికి చెందిన మాజీ బిజెపి నేత వాజ్‌బాయ్ వాలా ప్రస్తుతం గుజరాత్ రాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్నారు. అయితే ఈ తరుణంలో గవర్నర్ ఏం చేస్తారనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

హంగ్ దిశగా పలితాలు వెలువడితే అతి పెద్ద పార్టీగా అవతరించిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ పిలుస్తారు. ఆ తర్వాత మెజారిటీని నిరూపించుకొనేందుకు సమయం ఇస్తారు. ఆ సమయం లోపుగా మెజారిటీని నిరూపించుకోకపోతే ఇతర పార్టీలకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తారు.అయితే కర్ణాటకలో చోటుచేసుకొన్న పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ఏం చేస్తారనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

English summary
Yeddyurappa will meet governor on Tuesday evening for forming government in Karnataka state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X