బలపరీక్షకు ముందే సీఎం కుమారస్వామికి బీజేపీ వార్నింగ్: ఈ రోజు చెయ్యాలి, లేదంటే సినిమా!
బెంగళూరు: శుక్రవారం మద్యాహ్నం కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్.డి.కుమారస్వామి కర్ణాటక శాసన సభలో బలపరీక్షలో మెజారీ ఎమ్మెల్యే మద్దతుతో తన పదవిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న సందర్బంలో సీఎం కుమారస్వామి మా డిమాండ్లు ఈ రోజు తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని బీజేపీ హెచ్చరించింది. ఈ రోజు రైతుల రుణమాఫీ చెయ్యాలని బీఎస్. యడ్యూరప్ప సీఎం కుమారస్వామికి అల్టిమేటం జారీ చేశారు.

శాసన సభ సమావేశం
విధాన సౌధకు బయలుదేరే ముందు బీఎస్. యడ్యూరప్ప ప్రైవేటు హోటల్ దగ్గర మీడియాతో మాట్లాడారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో జేడీఎస్ నేత హెచ్.డి. కుమారస్వామి ప్రజలకు హామీ ఇచ్చారని బీఎస్. యడ్యూరప్ప గుర్తు చేశారు.

మెజారిటీ లేదంట
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత దేవాలయం దగ్గర మీడియాతో మాట్లాడిన హెచ్.డి. కుమారస్వామి జేడీఎస్ కు సంపూర్ణ మెజారిటీ లేనందున రైతుల రుణమాఫీ చెయ్యడం కష్టంగా ఉందని ఇదే హెచ్.డి. కుమారస్వామి చెప్పడం విడ్డూరంగా ఉందని యడ్యూరప్ప ఎద్దేవ చేశారు.

సీఎంకు బీజేపీ వార్నింగ్
శుక్రవారం శాసన సభలో బలపరీక్ష నిరూపించుకున్న వెంటనే రైతుల రుణమాఫీ చేస్తున్నామని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ప్రకటించాలని బీఎస్. యడ్యూరప్ప డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ చెయ్యకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని బీఎస్. యడ్యూరప్ప హెచ్చరించారు.

సూట్ కేస్ ప్రభుత్వం
తన కుమారుడు పూర్తి కాలం అధికారంలో ఉండరని స్వయంగా సీఎం హెచ్.డి. కుమారస్వామి తల్లి చెప్పారని యడ్యూరప్ప ఆరోపించారు. అంతేకాకుండా సీఎం హెచ్.డి. కుమారస్వామి సొంత సోదరుడు హెచ్.డి. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ సూట్ కేసు ఉన్నంత వరకే జేడీఎస్ ప్రభుత్వం అని చెప్పారని, ఇలాంటి పార్టీ అధికారంలోకి రావడంతో కన్నడిగులు తలదించుకుంటున్నారని యడ్యూరప్ప విమర్శించారు.

జేడీఎస్ ను కాంగ్రెస్ అంతం చేస్తోంది
జేడీఎస్ ను పూర్తిగా అంతం చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దం అయ్యిందని బీఎస్. యడ్యూరప్ప ఆరోపించారు. ఆ విషయం గ్రహించలేని కుమారస్వామి సీఎం కుర్చిలో కుర్చోవడానికి సిద్దం అయ్యారని, రానున్న రోజుల్లో జేడీఎస్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆ పార్టీ నాయకులకే తెలుస్తోందని బీఎస్. యడ్యూరప్ప జోస్యం చెప్పారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications