వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యడియూరప్పను దించే కుట్ర..? ప్రత్యర్థులకు అస్త్రంగా మారిన సీఎం 'రిక్వెస్ట్'..

|
Google Oneindia TeluguNews

ప్రత్యర్థుల మాటలను తమకు అనుకూల అస్త్రాలుగా మలుచుకోవడం రాజకీయాల్లో సర్వసాధారణం. అందులో పాజిటీవిటీ ఉన్నా సరే.. దాన్ని నెగటివ్‌గా మార్చి తమకు అనుకూలంగా మార్చుకోగలరు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు ఇప్పుడిదే పరిస్థితి ఎదురైంది. కర్ణాటకకు రావాల్సిన నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని ఆయన విజ్ఞప్తి చేయగా.. అలా సున్నితంగా చెప్తే తోలుమందం ప్రభుత్వానికి ఎలా వినపడుతుందని సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు,సిద్దరామయ్యను గద్దె దించేందుకు బీజేపీలోనే కుట్ర జరుగుతోందని, ఆయనకు చెడ్డ పేరు తెచ్చేందుకే కేంద్రం కూడా నిధులు ఇవ్వడం లేదని అన్నారు.

సిద్దరామయ్య ఏమన్నారు..

సిద్దరామయ్య ఏమన్నారు..

కర్ణాటకకు నిధులు కావాలని సీఎం యడియూరప్ప చేతులు కట్టుకుని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారని.. కానీ ఆయన నుంచి ఎటువంటి స్పందనా లేదని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. సాధారణ ప్రభుత్వమైతే యడియూరప్ప విజ్ఞప్తికి స్పందించేదని,కానీ తోలుమందం ప్రభుత్వం కాబట్టే స్పందించలేదని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు,యడియూరప్ప ఒక బలహీన నాయకుడని,అందుకే కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే అయినా.. ఆయన విజ్ఞప్తిని లెక్కచేయడం లేదని అన్నారు.

 యడియూరప్పను దించేందుకే..

యడియూరప్పను దించేందుకే..

యడియూరప్పను అణగదొక్కడానికే మోదీ కర్ణాటకను విస్మరిస్తున్నారని సిద్దరామయ్య కొత్త వాదన వినిపించారు. యడియూరప్పను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేందుకు బీజేపీలోని ఒక వర్గం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వాళ్లకు సహకరించేలా కేంద్రం కూడా యడియూరప్పను లెక్క చేయడం లేదని.. ఆయన కోరిన నిధులను మంజూరు చేయడం లేదని అన్నారు.

యడియూరప్ప బలహీన నాయకుడు..

యడియూరప్ప బలహీన నాయకుడు..


యడియూరప్ప తన 25 మంది ఎంపీలను తీసుకుని ప్రధాని ఇంటి ముందు బైఠాయించాల్సిందని, కర్ణాటక వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు డిమాండ్ చేసి ఉండాల్సిందని సిద్దరామయ్య అన్నారు. కానీ యడియూరప్పకు అంత ధైర్యం లేదని, ఆయనో బలహీన నాయకుడని విమర్శించారు. వరదల కారణంగా చాలామంది నిరాశ్రయులు అయ్యారని, ఇప్పటికీ చాలామంది తాత్కాలిక పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసిన టెంట్లలోనే నివసిస్తున్నారని అన్నారు.

25మంది ఎంపీలు గెలిచి ఏం లాభం

25మంది ఎంపీలు గెలిచి ఏం లాభం

కేంద్రంలో,రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉందని.. కాబట్టి కర్ణాటకను అదృష్టం తలుపు తడుతుందని ప్రధాని మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను సిద్దరామయ్య గుర్తుచేశారు. అదృష్టం తలుపు తట్టడం సంగతి దేవుడెరుగు.. కేంద్ర ప్రభుత్వం మాత్రం బీజేపీ నేతలకే తలుపులు తీయడమే లేదని విమర్శించారు. రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలను గెలిపించి పంపిస్తే.. యడియూరప్పను అసలు పట్టించుకోవడమే లేదన్నారు.

English summary
Day after Yediyurappa requested PM Modi to release funds for Karnataka, the chief minister's plea gave fresh ammunition to opposition with Siddaramaiah dubbing Centre 'thick-skinned'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X