Yellow Fungus: భారత్‌లో కొత్త ఫంగస్.. బ్లాక్ ఫంగస్‌కంటే డేంజరస్- లక్షణాలు ఇవే..!
ఏ ముహూర్తానా కరోనావైరస్ గురించి ప్రపంచంకు తెలిసిందో... ఇక అప్పటి నుంచే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలంవెల్లదీస్తున్నారు. ఇక కరోనా వైరస్ తొలికేసు చైనాలో వెలుగు చూశాక ఇతర దేశాలకు ఈ మహమ్మారి పాకింది. దీని నుంచి సరికొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. మొన్నటి వరకు కరోనావైరస్ ప్రజలను బెంబేలెత్తించగా.. ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ వణికించింది. దీని తర్వాత వైట్ ఫంగస్ గురించి విన్నాం. తాజాగా ఎల్లో ఫంగస్ ఇప్పుడు గుబులు పుట్టిస్తోంది. అసలు ఈ ఎల్లో ఫంగస్ అంటే ఏంటి.. ఇది ఎంతవరకు ప్రమాదకరం
Recommended Video

భారత్‌లో తొలి ఎల్లో ఫంగస్ కేసు
దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్న వేళ మరో కొత్త ఫంగస్ జాబితాలో చేరిపోయింది. దీనిపేరే ఎల్లో ఫంగస్. ఎల్లో ఫంగస్‌కు సంబంధించిన తొలికేసు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.ఇది బ్లాక్ ఫంగస్ మరియు వైట్ ఫంగస్‌ల కంటే ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎల్లో ఫంగస్ సోకిస వ్యక్తికి ప్రముఖ ఈఎన్‌టీ స్పెషలిస్టు నేతృత్వంలో చికిత్స అందుతోంది.

బ్లాక్ ఫంగస్ కంటే ప్రమాదం..లక్షణాలు ఇవే
బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్‌ల కంటే ప్రమాదకరంగా ఉంటుందని చెబుతున్న ఎల్లో ఫంగస్ లక్షణాలు ఎలాగుంటాయి.. అంటే మనిషిలో బద్దకం ఎక్కువగా ఉండటం, నిదుర మత్తు కలిగి ఉండటం, ఆకలి కాకపోవడం, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఎల్లో ఫంగస్ మరింత తీవ్రంగా మారిందంటే మనిషిలో మరిన్ని మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు. అంటే నిత్యం చీము కారడం, ఒకవేళ ఏమైనా గాయాలుంటే ఆ గాయాలు మానకపోవడం, గాయాలు మానేందుకు చాలా రోజుల సమయం పట్టడం, ఒంట్లో భాగాలు పనిచేయకపోవడం, కళ్లు లోపలికి పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.

పరిసరాల శుభ్రత ముఖ్యం
ఎల్లో ఫంగస్ అనేది ఓ ప్రమాదకరమైన డిజీస్ అని.. ఇది శరీరంలో అంతర్గతంగా ఏర్పడి దాడి చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభించాలని లేదంటే ప్రాణాలకే ముప్పువాటిల్లే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఎల్లో ఫంగస్‌కు యాంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్ మాత్రమే విరుగుడని చెప్పారు. ఎల్లో ఫంగస్ అనే వ్యాధి రావడానికి ప్రధాన కారణం పరిసరాలు శుభ్రంగా లేకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు.
వ్యక్తిగత శుభ్రత కూడా మెయిన్‌టెయిన్ చేయాలని సూచిస్తున్నారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే బ్యాక్టీరియా ఫంగస్ పేరుకుపోయి దాడి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంటిలో తేమ శాతం కూడా చూసుకుంటూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియా మరియు ఫంగస్‌లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుంటాయని చెప్పారు. 30శాతం నుంచి 40శాతం మధ్య తేమశాతం ఉంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications