సీఎంపై ఎఫ్‌బీలో వ్యాఖ్య, జయలలిత కేసులో జడ్జి పైన..

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పైన ఫేస్‌బుక్‌లో అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మల్దా జిల్లాకు చెందిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 25 ఏళ్ల బాపి పాల్ జానకినగర్ గ్రామానికి చెందిన వ్యక్తి. అతనిని బుధవారం రాత్రి అరెస్టు చేశామని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మద్దతుదారులు అతని పైన హరిశ్చంద్రపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, దీంతో అతనిని అరెస్టు చేశామన్నారు.

Yet another Facebook arrest in WB: Youth held for making derogatory remark against Mamata

బాపి పాల్‌ను కోర్టులో ప్రొడ్యూస్ చేశామని, అతనికి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించిందని తెలిపారు. కాగా, సదరు విద్యార్థి మమతా బెనర్జీ పైన ఏం అమానుష వ్యాఖ్యలు చేశారో తెలియరాలేదు. బాపి పాల్ తండ్రి దీనిని కొట్టి పారేస్తున్నారు. తన కొడుకు మమత పైన ఎలాంటి అమానుష వ్యాఖ్యలు చేయలేదని చెబుతున్నారు.

మరోవైపు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు ఇచ్చిన కర్ణాటక ప్రత్యేక కోర్టు జడ్జి పైన న్యాయవాది ఒకరు విమర్శలు చేశారు. అన్నాడీఎంకే తరపున ఈ కేసులో పని చేస్తున్న తంగా కొలాన్జినాథన్ అనే లాయర్ తిట్టకుడి ప్రాంతం వద్ద ఓ బ్యానర్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

దానిపై "న్యాయం నష్టపోయింది, అన్యాయం గెలిచింది" అంటూ జడ్జి పైన ఆరోపణలు చేసినట్లు చెప్పారు. అంతేగాక అన్నాడీఎంకేరాజకీయ ప్రత్యర్థులు, డీఎంకే అధినేత కరుణానిధి పైనా విమర్శలు చేశాడన్నారు. వెంటనే అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+