యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం: మత పెద్దల ప్రశంసలు

Subscribe to Oneindia Telugu

లక్నో: అక్రమ కబేళాలపై నిషేధం, రోమియోల ఆటకట్టించేందుకు టీంల ఏర్పాటు, తదితర నిర్ణయాలతో ఇప్పటికే సంచలనంగా మారిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవిత్ర స్థలాలుగా భావించే అన్ని ప్రదేశాల్లోనూ మద్య నిషేధం అమలు చేస్తున్నట్టు ప్రకటించారు.

నూతన ఎక్సైజ్ విధానాన్ని రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జాతీయ రహదారుల పక్కన మద్యం దుకాణాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్ది రోజులకే సీఎం యోగి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. యూపీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 8,544 మద్యం దుకాణాలను వేరే స్థలాలకు తరలించారు.

Yogi Adityanath Bans Alcohol at Pilgrimage Places of All Religions

సీఎం మద్య నిషేధం విధించిన ప్రాంతాల్లో హిందూ పుణ్యక్షేత్రాలతో పాటు.. ముస్లిం సహా పలు మతాలకు చెందిన పవిత్ర స్థలాలు కూడా ఉండడం గమనార్హం. బృందావన్, అయోధ్య, చిత్రకూటం, మిశ్రిక్ నైమిశారణ్యం, పిరాన్ కలియార్, దేవ షరిఫ్, దేవ్‌బంద్ సహా తదితర పవిత్ర క్షేత్రాల్లో ఇకపై మద్య నిషేధం అమలు కానుంది. కాగా, తాజా నిర్ణయంతో పలు మతాలకు చెందిన పెద్దలు యోగిని ప్రశంసింస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After a crackdown on illegal slaughterhouses and a controversial, but popular, campaign against ‘Romeos’ in Uttar Pradesh, Chief Minister Yogi Adityanath has now banned alcohol at pilgrimage places and ordered the formation of a new excise policy.
Please Wait while comments are loading...