21వ శతాబ్దానికే పెద్ద న్యూస్: ఉమ, హెచ్చరించిన యోగి ఆదిత్యనాథ్

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: తన వరకు నరేంద్ర మోడీ ప్రధాని కావడం, సోదరుడు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావడం ఈ 21వ శతాబ్దంలో అత్యుత్తమ వార్తలు అని కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు ఉమా భారతి అన్నారు.

యూపీలో సవాళ్లు: దటీజ్.. యోగి ఆదిత్యనాథ్, బీజేపీయే మోకరిల్లింది!

జాతీయవాదం, అభివృద్ధి కలయికగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని యోగి ఆదిత్యనాథ్ నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ ప్రధానిగా, ఆదిత్య సీఎంగా ఎంపిక కావడం ఈ శతాబ్దంలోనే పెద్ద న్యూస్ అన్నారు.

యూపీలో అభివృద్ధిపై యోగి దృష్టి సారిస్తారన్నారు. ప్రతిపక్ష వాదులకు చెంపపెట్టులా ఆయన పాలన ఉంటుందన్నారు.

Yogi Adityanath Becoming CM Of UP The Best News Of 21st Century, Says Uma Bharti

అయిదుసార్లు లోకసభ ఎంపీగా ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్‌ యూపీ సీఎంగా మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు హాజరుకానున్నారు.

మరోవైపు, ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎటువంటి ఆర్భాటాలకు పోవద్దని ఆదిత్యనాథ్‌ కార్యకర్తలను హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఎవరూ ప్రవర్తించవద్దని, అటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలకు తీసుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించే విషయంలో రాష్ట్ర పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Expressing delight over Yogi Adityanath, who is all set to take oath as Uttar Pradesh Chief Minister today at 2:15 p.m., Union Minister Uma Bharti addressed Yogi as her younger brother and said the news of him becoming the Chief Minister of the state was the best 'of the 21st century'.
Please Wait while comments are loading...