యూపీని పాక్‌లా మారకుండా కాపాడారు: యోగిపై ప్రాచీ

ఉత్తర్‌ప్రదేశ్‌ మరో పాకిస్థాన్‌గా మారకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కాపాడారని హిందుత్వ నేత సాధ్వి ప్రాచి అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం అయిన యోగి ప్రజలను సంతోషపరచడమే కాకుండా రాష్ట్రం పాక

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌ మరో పాకిస్థాన్‌గా మారకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కాపాడారని హిందుత్వ నేత సాధ్వి ప్రాచి అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం అయిన యోగి ప్రజలను సంతోషపరచడమే కాకుండా రాష్ట్రం పాకిస్థాన్‌లా మారకుండా చేశారని ప్రశంసించారు.

అంతేగాకుండా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇంతకుముందున్న పాలనలో జరిగిన సంఘటనలపై యోగివిచారణ జరిపిస్తున్నారని.. దీంతో కొందరికి రాత్రుళ్లు నిద్ర పట్టడంలేదనిపరోక్షంగా సమాజ్‌వాదీ పార్టీని ఎద్దేవా చేశారు. త్వరలో ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ మద్యం నిషేధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

yogi adityanath

యోగిని కొత్త ట్రంపంటూ విద్యార్థుల విచ్ఛిన్న వాదం

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఓ యూనివర్శిటీలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు కలకలం సృష్టించాయి. స్థానిక జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్థులు ఆర్ఎస్ఎస్, యూపీ సీఎం యోగికి వ్యతిరేకంగా కొన్ని బ్యానర్లు ఏర్పాటు చేశారు.

అంతేగాక, 'ఆదిత్యనాథ్‌.. ఓ కొత్త ట్రంప్‌' అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని యూనివర్శిటీలోని ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగం వెలుపల విద్యార్థులు నిరసన చేపట్టారు. జమ్మూ కాశ్మీర్‌, నాగాలాండ్‌, మిజోరాంకు స్వాతంత్య్రం రావాలని నినాదాలు చేశారు. దీంతో స్థానికంగా కలకలం రేగింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపడతామన్నారు. జాదవ్‌పూర్‌ యూనివర్శిటీలో విద్యార్థులు ఇలా నిరసనకు దిగడం ఇది తొలిసారి కాదు. గత ఫిబ్రవరిలోనూ జమ్మూకాశ్మీర్‌, నాగాలాండ్‌, మిజోరాంలకు స్వాత్రంత్యం రావాలంటూ పోస్టర్లు అంటించి నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+