భారత్ లో కలిసేందుకు పాక్ ప్రజలు రెడీ-యోగీ ఆదిత్యనాథ్ కామెంట్స్..!

భారత్ చిరకాల ప్రత్యర్ధి, పొరుగుదేశం పాకిస్తాన్ పై యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. పాకిస్తాన్ తీవ్రవాదం, ఆర్ధిక పరిస్ధితి, పీవోకే ల ప్రజల ఆకాంక్షలపై యోగీ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో ప్రజలు భారత్ లో కలవాలనుకుంటున్నట్లు యోగీ వెల్లడించారు. తాజాగా అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోయోగీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

భారత్ లో తొమ్మిదేళ్ల నరేంద్రమోడీ పాలన గురించి మాట్లాడిన యోగీ ఆదిత్యనాథ్.. ఈ తొమ్మిదేళ్లలో సరిహద్దుల్ని కేంద్రం పటిష్టం చేసిందని వెల్లడించారు. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో కేంద్రం చేపట్టిన చర్యల్ని యోగీ ప్రశంసించారు. అలాగే పొరుగున ఉన్న పాకిస్తాన్ నానాటికీ అప్పుల్లో కూరుకుపోతోందన్నారు. అలాగే పీవోకేలో పరిస్ధితుల్ని కూడా యోగీ ప్రస్తావించారు.

yogi adityanath key comments on people in PoK, says they want to be part of india

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో నివసిస్తున్న ప్రజలు భారత్‌లో భాగం కావాలనే తమ కోరికను వ్యక్తం చేస్తున్నారని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. పీఓకే వాసులు భారత్‌లో చేరేందుకు తమ మద్దతును ప్రకటించడం ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో కలిసిపోవాలనుకునే పీఓకే నివాసులలో పెరుగుతున్న సెంటిమెంట్‌ను గుర్తుచేస్తూ యోగీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే రాజకీయంగా పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీతో విభేదిస్తున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు.. భారత్ లో కలిసేందుకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ దిశలో కొంతకాలంగా నిరసనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యోగీ ఆదిత్యనాధ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు తమ రాజకీయ స్థితిని మార్చాలని, భారతదేశంలో భాగం కావడానికి
మొగ్గు చూపుతున్న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల ఆకాంక్షకు మద్దతుగా నిలుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+