మహేశ్ బాబు శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో యోగీ సర్కార్ విన్నూత్న పథకం...
గతంలో టాలీవుడ్ లో మహేశ్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమా అప్పట్లో సంచలనం రేపింది. రాష్ట్రంలోని చిన్న చిన్న పల్లెలు, పట్టణాల నుంచి నగరాలకు, విదేశాలకు వెళ్లి స్ధిరపడిన శ్రీమంతులు తాము పుట్టిన గడ్డకు తిరిగొచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావడం అనేది ఈ సినిమా కాన్పెప్ట్. సరిగ్గా ఇప్పుడు ఇదే కాన్పెప్ట్ ను యూపీలో అమలు చేసేందుకు అక్కడి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక పథకం ప్రారంభించింది.
మాతృభూమి యోజన పేరుతో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజాగా కొత్త పథకాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా నగరాలు, విదేశాలకు వలసపోయిన యూపీ స్ధానికులు తిరిగి తాము పుట్టి పెరిగిన పల్లెల్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చేలా వారిని ఒప్పించడం ప్రభుత్వ లక్ష్యం. తద్వారా యూపీ పల్లెల్లోనూ వెలుగులు నింపాలనేది యోగీ ఆదిత్యనాథ్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎన్నారైలకు పరిమితం చేసిన ఈ కార్యక్రమం ఆ తర్వాత నగరాలకూ విస్తరింపచేయనున్నారు.

నగరాల్లో లేదా విదేశాల్లో పని చేసే వ్యక్తులు తమ గ్రామాలతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి సహాయం చేయడం, వారు కావాలనుకుంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం డబ్బును విరాళంగా ఇవ్వడం ఈ పథకం లక్ష్యంగా యోగీ సర్కార్ చెబుతోంది.
ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుందని, మొదటిది వ్యక్తులు వారి మూలాలతో తిరిగి కనెక్ట్ కావడం, అలాగే వారు తమ మాతృభూమికి సాయం చేయడం అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తల్లి, మాతృభూమి స్వర్గం కంటే గొప్పవి. వాటి మధ్య పోలిక ఉండదు. కావున ప్రతి ఒక్కరూ మాతృభూమి యోజనలో పాల్గొనే అవకాశం కల్పించాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. నవంబర్ 2021లో ఉత్తరప్రదేశ్ కేబినెట్ ఏదైనా గ్రామం అభివృద్ధికి సహకరించడానికి వ్యక్తులు లేదా ప్రైవేట్ సంస్థలను సులభతరం చేయడానికి మాతృభూమి యోజన అమలు ప్రతిపాదనను ఆమోదించింది.












Click it and Unblock the Notifications