మోడీ నియోజకవర్గంలో 24న కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవం-యోగీ ఆదిత్యనాథ్ స్పెషల్ ఫోకస్..
వారణాసి : యూపీలోని ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. గతంలో యూపీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి కావడంతో వాటిని ఈ నెల 24న ప్రారంభించేందుకు మోడీ ఇక్కడికి వస్తున్నారు. దీంతో ఈ టూర్ ను యోగీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
మామిడి, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ప్యాకింగ్, మార్కెటింగ్ కోసం ఉద్దేశించిన ఇంటిగ్రేటెడ్ ప్యాకేజింగ్ హౌస్ ప్రాజెక్టును వారణాసిలో ఈ నెల 24న ప్రధాని మోడీ ప్రారంభించబోతున్నారు. ఈ ప్రాజెక్టును ప్రధాని మోడీ.. 2021 జూన్ 15న శంఖుస్ధాపన చేశారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే దీన్ని పూర్తి చేసి ప్రారంభించేందుకు మోడీ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్యాకేజింగ్ ప్రాజెక్టుతో పాటు ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు మోడీ వారణాసి వస్తున్నారు.

మోడీ ప్రారంభించబోయే ప్రాజెక్టుల్లో లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్ పోర్టులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ , పోలీసు బరాక్స్, సోలార్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వీటిని ప్రారంభించేందుకు మోడీ రానున్న నేపథ్యంలో యోగీ ఆదిత్యనాథ్ అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు.
ఈ ప్రాజెక్టుల పురోగతి, వీటి ప్రారంభోత్సవం సందర్భంగా తీసుకుంటున్న చర్యలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్న యోగీ ఆదిత్యనాథ్.. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అలాగే భద్రతతో పాటు ఇతర చర్యలపై యోగీ సమీక్షించారు.












Click it and Unblock the Notifications