yogi adityanath : ట్విట్టర్ లో 2.4 కోట్లు దాటిన యోగీ ఫాలోయర్లు-రాహుల్ ను దాటిన రికార్డు..
ఉత్తర్ ప్రదేశ్ లో తాజాగా ఆరేళ్ల పాలన పూర్తి చేసుకున్న బీజేపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రజాదరణ అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా సోషలా్ మీడియాలో ఆయన పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. తాజాగా ట్విట్టర్ లో ఆయన ఫాలోయర్ల సంఖ్య 2.4 కోట్లకు చేరుకుంది.
ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తాజాగా 2.4 కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇప్పటికే వరుసగా పెరుగుతూ వస్తున్న ఈ ఫాలోయర్ల సంఖ్య కొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. ఈ విషయంలో యోగీ ఆదిత్యనాథ్.. కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను కూడా దాటేశారు. యోగీకి 2.4 ట్విట్టర్ ఫాలోయర్లు ఉండగా.. రాహుల్ కు 2.3 కోట్లు, అఖిలేష్ కు 1.8 కోట్ల మంది మాత్రమే ఉన్నారు.

ట్విట్టర్ లో ముఖ్యంగా యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం సుపరిపాలనకు సంబంధించి పెట్టే హ్యాష్ ట్యాగ్ లు ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. వీటిని యూపీ ప్రజలే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఎక్కువగా చూస్తూ వాటిపై స్పందిస్తుంటారు. అంతెందుకు రెండు రోజుల క్రితం ట్విట్టర్ లో అత్యధికులు కోరుకునే సీఎం పేరుతో పెట్టిన హ్యాష్ ట్యాగ్ వైరల్ అయింది. దీనిపై స్పందించిన ఎన్నారైలు సైతం అత్యంత విజయవంతమైన సీఎం అంటూ స్పందించారని యోగీ కార్యాలయం తెలిపింది.












Click it and Unblock the Notifications