కోవిడ్ అనాథల కోసం యోగీ సర్కార్ సంక్షేమ పథకం-పరిహారంతో సరిపెట్టకుండా నెలవారీ సాయం..

కోవిడ్ కారణంగా తల్లితండ్రుల్ని కోల్పోయి అనాథలుగా మారిన వారి కోసం యూపీ సర్కార్ ఓ సంక్షేమ పథకాన్ని ప్రారంభించింది.

రెండేళ్ల క్రితం దేశాన్ని కుదిపేసిన కోవిడ్ మహమ్మారి కారణంగా ఉత్తర్ ప్రదేశ్ లోనూ వేలాది మరణాలు చోటు చేసుకున్నాయి. కోవిడ్ ప్రభావంతో తల్లితండ్రుల్లో ఒకరిని కోల్పోయిన వారు, ఇద్దరినీ కోల్పోయి పూర్తి అనాథలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వాలు మానవతాదృక్ఫథంతో సాయం అందించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. పలు ప్రభుత్వాలు ఈ దిశగా నిర్ణయాలు తీసుకున్నాయి. కానీ వాటన్నింటికీ భిన్నంగా యూపీలో యోగీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

కోవిడ్ సోకి తల్లితండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరు చనిపోయి అనాథలుగా మారిన పిల్లలకు చాలా ప్రభుత్వాలు ఏకమొత్తంగా పరిహారం అందించాయి. మరికొన్ని ప్రభుత్వాలు నిధులు లేవనే సాకుతో ఇప్పటికీ తప్పించుకుంటున్నాయి. కానీ యూపీలో యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ మాత్రం కోవిడ్ తో అనాథలుగా మారిన వారి కోసం ఏకంగా ఓ రెగ్యులర్ సంక్షేమ పథకాన్నే అందుబాటులోకి తెచ్చింది. యూపీలో తమ ప్రభుత్వం ఉన్నంతవరకూ ఈ పథకం అమలు చేసి తీరుతామని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తాజాగా ప్రకటించారు.

yogi adiyanaths welfare scheme for covid 19 orphans become role model for other states

కోవిడ్ మహమ్మారితో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం యూపీ ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాన్ని రూపొందించింది.
తాజాగా సీఎం యోగీ ఆదిత్యనాథ్.. తన సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా కోవిడ్ సమయంలో ఒకరు లేదా ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు యూపీ ప్రభుత్వం నెలవారీ ఖర్చు రూ. 4,000 అందజేస్తుంది. ఇప్పటికే ఇస్తున్న పింఛన్ల తరహాలోనే వీరికి ఏడాది పొడవునా ఈ మొత్తం ప్రభుత్వం అందించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+