Yogi Adityanath : యూపీ మాఫియాకు యోగీ ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్..!
యూపీలో ప్రజలు శాంతి, సంబరాల్ని కోరుకుంటున్నారని, మాఫియాను కాదని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. తమకు మాఫియా అక్కర్లేదన్నారు. తాజాగా గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కు ఓ పాత కేసులో కోర్టు యావజ్జీవ శిక్ష విధించిన సందర్భంగా యోగీ ఈ వ్యాఖ్యలు చేశారు. కుషీనగర్ లో పలు అభివృద్ధి పథకాలకు శంఖుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్ ఇకపై పెట్రోల్, డీజిల్ దిగుమతులపై ఆధారపడే పరిస్దితి లేదని, దేశీయంగా తయారయ్యే ఇథనాల్ పై దృష్టిసారిస్తున్నట్లు యూపీ సీఎం యోగీ తెలిపారు. కుషీనగర్ లో ఇథనాల్ ప్లాంట్ల ఏర్పాటుకు ఓ పారిశ్రామిక వేత్తల బృందం ప్రయత్నిస్తోందన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సాయం అందిస్తామన్నారు. ఈ ప్లాంట్ కు అవసరమైన మానవ వనరుల కోసం స్ధానికంగా ఉన్న ఐఐటీలు, కాలేజీలతో కనెక్ట్ చేస్తున్నట్లు యోగీ వెల్లడించారు. పీఎం-సీఎం ఇంటర్న్ షిప్ కార్యక్రమం కింద ఈ ప్లాంట్ కు ఎంపికైన వారికి సగం జీతం కేంద్రం ఇస్తుందని, మిగతా సగం రాష్ట్రం సమకూరుస్తుందన్నారు.

కుషీనగర్ లో త్వరలో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతోందని యోగీ పేర్కొన్నారు. సింగపూర్, బ్యాంకాక్, దక్షిణాసియా దేశాలు, శ్రీలంక, అరబ్ దేశాల నుంచి ఇక్కడికి ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. శ్రీరాముడు తొలిసారి సీతను తీసుకుని కుషీనగర్ మీదుగానే అయోధ్యకు వెళ్లినట్లు యోగీ వెల్లడించారు. అలాగే బుద్ధుడి మహాపరినిర్వాణ స్ధలం కూడా ఇదేనన్నారు. ఇక్కడి పవనగర్ తో జైన తీర్ధాంకరుడు మహావీరుడికి అనుబంధం ఉందన్నారు.












Click it and Unblock the Notifications