చెరుకు, ఇథనాల్ ఉత్పత్తిలో దేశంలోనే యూపీ టాప్-యోగీ ఆదిత్యనాథ్ వెల్లడి..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చక్కెర, చెరకు ఉత్పత్తిలోనే కాకుండా ఇథనాల్ ఉత్పత్తిలోనూ, ఖండసారి చక్కెర తయారీ యూనిట్ల ఏర్పాటులోనూ దేశంలోనే అగ్రగామిగా ఉందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. రాష్ట్రంలో చెరుకు ఉత్పత్తి గణనీయంగా పెరిగిన నేపథ్యంలో యోగీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చెరుకు ఉత్పత్తిలో యోగీ సర్కార్ రైతులకు పోటీలు కూడా నిర్వహించింది.
రాష్ట్రస్థాయి చెరకు ఉత్పత్తి పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో యోగీ ప్రసంగించారు. 2017కు ముందు రాష్ట్రంలో చెరుకు తూకంలో తేడాలు రావడంతో పాటు రశీదులు చోరీకి గురై రశీదులు అందక రైతులు ఇబ్బందులు పడేవారన్నారు. దీంతో రైతులు తరచూ నిరసనలకు దిగేవారన్నారు. దీనికి తోడు చక్కెర మిల్లులు కూడా మూతపడడంతో రైతులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని యోగీ తెలిపారు. కొన్నేళుగా రైతులకు చెరకు ధరల చెల్లింపు కూడా పెండింగ్‌లో ఉందన్నారు.

కానీ 2017లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక 2010 నుంచి 2017 వరకు చెరకు పెండింగ్‌లో ఉన్న చెల్లింపుల చెల్లింపులకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నామన్నారు. రైతుల కోసం ప్రధాని మోదీ అమలు చేస్తున్న పలు సంస్కరణలు రాష్ట్రంలో గణనీయమైన మార్పును తీసుకొచ్చాయని యోగీ గుర్తుచేశారు. రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాలు ఇప్పుడు చక్కెరతో పాటు ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని, ఫలితంగా, చెరకు, చక్కెర, ఇథనాల్ ఉత్పత్తితో పాటు ఖండసారి యూనిట్ల ఏర్పాటులో దేశంలోనే యుపి మొదటి స్థానంలో ఉందని యోగీ గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications