రేపే యూపీ తొలిదశ పోరు-మోడీతో విజయసంకేతం చూపుతూ ఫొటో షేర్ చేసిన యోగీ
యూపీలో రేపు తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో జరిగే ఈ ఎన్నికలకు ఇప్పటికే ప్రచారం ముగిసింది. పశ్చిమ యూపీలోని పలు స్ధానాల్లో జరిగే ఈ ఎన్నికలకు ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే యూపీలో యోగీ, అఖిలేష్ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో తొలిదశ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రేపు యూపీలో తొలిదశ ఎన్నికల పోరు జరగనున్న నేపథ్యంలో విజయంపై అధికార బీజేపీ ధీమాగా కనిపిస్తోంది. దీంతో సీఎం యోగీ ఆదిత్యనాథ్.. గతంలో ప్రధాని మోడీతో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇందులో ప్రధాని మోడీతో కలిసి ఆయన విజయకేతనం సంకేతాన్ని చూపుతూ కనిపిస్తున్నారు. ఈ ఫోటోను రేపటి ఎన్నికల విజయసంకేతంగా యోగీ షేర్ చేసినట్లు తెలుస్తోంది. అసలే ఈ ఎన్నికల్లో యోగీకీ, బీజేపీ అధిష్టానానికీ మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రచారం నేపథ్యంలో యోగీ షేర్ చేసిన ఫొటోపై సొంత పార్టీ బీజేపీతో పాటు మిగతా పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది.

ఈ ఫొటోతో పాటు చేసిన హిందీలో చేసిన ట్వీట్‌లో, యోగి ఆదిత్యనాథ్.. ప్రధాని మోదీ తన చేతిని పైకి పట్టుకున్న చిత్రంతో పాటు పలు కవితా పంక్తుల్ని పంచుకున్నారు. "పీడిట్, శోషిత్, దుఃఖిత్ బాంధవోం కే హమకో హైం కష్ట మితానే, డేట్ హుయే హైం రాష్ట్రధర్మ్ పర్ సీనా తానే... కదమ్ నిరంతర చలతే జినకే, శ్రమ జినాకా అవిరామ్ హై. విజయ్ సునిశ్చిత్ హోతీ ఉనకీ, ఘోషిత్ హావ్ థేరాహై. (అణగారిన, దోపిడీకి గురవుతున్న, దుఃఖిస్తున్న బంధుమిత్రుల కోసం. మేము మా దేశం యొక్క కర్తవ్యం కోసం నిస్సంకోచంగా నిలబడి ఉన్నాము. మేము నిరంతరం కష్టపడి పని చేస్తున్నాము మరియు అది మా విజయాన్ని నిర్ధారిస్తుంది. మా విజయం ప్రకటించబడింది)." అని దానికి అర్ధం.
पीड़ित, शोषित, दुःखित बान्धवों के हमको हैं कष्ट मिटाने,
— Yogi Adityanath (@myogiadityanath) February 9, 2022
डटे हुए हैं राष्ट्रधर्म पर सीना ताने...
कदम निरंतर चलते जिनके,
श्रम जिनका अविराम है।
विजय सुनिश्चित होती उनकी,
घोषित यह परिणाम है॥ pic.twitter.com/GoOEjnfiwZ












Click it and Unblock the Notifications